Begin typing your search above and press return to search.

సోనియాకు చెత్త సలహా ఇచ్చిన సర్వే

By:  Tupaki Desk   |   3 Nov 2015 12:20 PM IST
సోనియాకు చెత్త సలహా ఇచ్చిన సర్వే
X
వరంగల్ బరిలో కాంగ్రెస్ అభ్యర్ది గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసినప్పటికీ అంతకుముందు పెద్ద కసరత్తే చేసింది. అయితే... అంతచేసినా ఎంపిక చేసిన అభ్యర్థిపై అధినేత్రి సోనియాకు ఇప్పటికీ సంతృప్తి లేదని తెలుస్తోంది. ఆమె ఎలాగైనా సరే ఆ స్థానం నుంచి పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ ను బరిలో ఉంచాలని ప్రయత్నించారు. అందులో భాగంగానే వివేక్ సుముఖత చూపకపోయినా కూడా ఆయనకు నచ్చజెప్పారు. వివేక్ తో సోనియా స్వయంగా మాట్లాడకపోయినా ఆమె తరఫున పార్టీ పెద్ద లు మాట్టాడి ఆయన్ను ఒప్పించారు. అయితే, చివరి నిమిషంలో మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ అడ్డంపడడంతో వివేక్ పేరు డిలీట్ అయిందట.

టీఆర్ ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్దులు ఎవరనే దాని పై అన్వేషించిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపిలు వివేక్ - సర్వే సత్యనారాయణ - రాజయ్యలతో పాటు జిల్లాకు చెందిన ఎస్సీ నేత రాజరపు ప్రతాప్ పేర్లను పరిశీలించింది . అయితే సౌమ్యుడిగా పేరున్న వివేక్ ను బరిలో దించితే టీఆర్ ఎస్ కు గట్టి పోటీ ఇస్తామని చాలామంది కాంగ్రెసు నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో ఆయన పేరు ను ఖరారు చేయాలని అధిష్టానం భావించింది . మొదట వరంగల్ నుండి బరి లో నిలవడానికి విముఖత వ్యక్తం చేసిన వివేక్ అధిష్టానం సూచనతో పోటీకి సిద్ధపడ్డారు. అయితే మాదిగలు అధికంగా ఉండే ఈ స్దానం నుంచి వివేక్ ను ఎలా బరిలో దింపుతారని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అభ్యంతరం తెలిపారట . ఈ విషయాన్ని వివేక్ ఓ ఇంటర్వ్యూ లో స్వయంగా వెల్లాడించారు. అంతేకాదు, టీఆర్ ఎస్ లోకి వెళ్లొచ్చిన వివేక్ కు టికెట్ ఎలా ఇస్తారని దిగ్విజయ్ ను సర్వే నిలదీశారట . దిగ్విజయ్ సర్వే మాటలను సోనియాకు చెప్పగా ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో వివేక్ కు కాకుండా రాజయ్యకు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలుస్తుంది . తనకు ఇష్టం లేకపోవడం వల్లే వరంగల్ బరి లో నిలవలేదని చెబుతున్న వివేక్ పోటీ లో లేకపోవడానికి అసలు కారణం సర్వే సత్యనారాయణ అన్న గుట్టు ఇప్పుడు బయటపడింది.