Begin typing your search above and press return to search.

ఇండిపెండెంట్ చేతి లో ఓడిన సీఎం .. ఇండిపెండెంట్ ఎవరంటే !

By:  Tupaki Desk   |   23 Dec 2019 12:22 PM GMT
ఇండిపెండెంట్ చేతి లో ఓడిన సీఎం .. ఇండిపెండెంట్ ఎవరంటే !
X
ఝార్ఖండ్ ప్రజలు ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ షాక్ ఇచ్చారు. ఈ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుండి బీజేపీ, జేఎంఎం, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతూ వచ్చాయి. కానీ , చివరికి బీజేపీ రేసు నుండి తప్పుకుంది. మొత్తంగా జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం రాష్ట్రంలో 81 సీట్లు ఉండగా .. ఇప్పటికే కాంగ్రెస్ -జేఎంఎం కూటమి 45 స్థానాలలో విజయం సాధించి స్పష్టమైన ఆదిక్యతని చూపించింది. ఇప్పటివరకు బీజేపీ కేవలం 26 స్థానాలలో మాత్రమే ..బీజేపీ విజయం సాధించింది.

బీజేపీ కి మరో పెద్ద షాక్ ఏమిటంటే ..ఆ రాష్ట్ర సీఎం రఘుబర్ దాస్.. స్వతంత్ర అభ్యర్థి చేతి లో ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఒకవైపు ఆధిక్యంలో కొనసాగుతున్న సమయంలో స్వతంత్ర అభ్యర్థి చేతి లో సీఎం సైతం ఓడిపోవడం ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పడుతోంది. జంషెడ్‌ పూర్ ఈస్ట్ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సరయూ రాయ్.. 8550 ఓట్ల తేడాతో సీఎం రఘుబర్ దాస్‌ ను ఓడించారు.

అయన రాజకీయ జీవితాన్ని ఒకసారి చూస్తే ...1951 జులై 16న జన్మించిన సరయూ రాయ్. 1970-72లో పట్నా యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. ఈయన 2005లో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో 3 వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి బన్నా గుప్తా చేతిలో ఓడి పోయారు. రాష్ట్ర విభజనకి ముందు రాయ్ బిహార్‌ లో ఎమ్మెల్సీ గా కూడా పని చేశారు.బిహార్‌ లో దాణా కుంభకోణాన్ని ఈయనే బయటపెట్టారు. ఈ కుంభ కోణం లోనే బిహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ సహా పలువురు సీనియర్ రాజకీయ నాయకులు జైలు పాలయ్యారు. మధు కోడా హయాం లో రూ.8 వేల కోట్ల ఐరన్ ఓర్ గనుల కేటాయింపు కుంభకోణాన్ని కూడా ఆయన బయటపెట్టారు. ఇక 2014 ఎన్నికల్లో సరయూ రాయ్ జంషెడ్‌ పూర్ వెస్ట్ నుంచి పోటీ 10 వేల ఓట్ల తేడాతో బన్నా గుప్తాపై గెలుపొందారు. కానీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించడంతో.. రఘుబర్ దాస్ కాబినెట్‌ నుంచి వైదొగిలిన రాయ్, బీజేపీకి రాజీనామా చేసి , జంషెడ్‌పూర్ ఈస్ట్ నుంచి ఇండిపెండెంట్‌ గా పోటీ చేసి ఏకంగా సీఎం అభ్యర్థినే మట్టి కరిపించారు.