Begin typing your search above and press return to search.
రేవంత్ పేరు వాడేస్తే సరిపోతుందా?
By: Tupaki Desk | 18 Aug 2022 4:30 PM GMTఇప్పటిదాకా కాంగ్రెస్ ను వీడుతున్న వారికీ ఇకపై వీడుతున్న వారికీ కూడా ఒకే ఒక్క కారణం పీసీసీ చీఫ్ రేవంత్ అని తేలిపోయింది. ఇది విమర్శనాత్మక సెటైర్. ఇదే మాట మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కూడా చెప్పేశారు. రాజగోపాల్ రెడ్డి, అంతకుముందు పోయిన వాళ్లు శశిధర్ రెడ్డి... ఇంక ముందు పోయేవాళ్లకి రేవంత్ పేరు చాలా పార్టీ వీడేందుకు?అలాగే ఉంది మరి పరిస్థితి.
తన 49 ఏళ్ల జీవితంలో ఇంతటి కల్లోలాలను ఎన్నడూ చూడలేదని మర్రి శశిధర్ వ్యాఖ్యానించారు. అంటే రేవంత్ ను వ్యతిరేకిస్తూ వస్తున్న వారంతా ఒక్కొక్కరుగా పార్టీ నుంచి వెళ్లిపోతున్నా కూడా అధిష్టానం పట్టించుకోవడం లేదు. అంటే వాళ్లంతా స్క్రాప్ అని పార్టీ భావిస్తుందా? మరి ఎందుకు మౌనం?
పార్టీ వదిలేవాళ్లు రేవంత్ ను డ్యామేజ్ చేసి ఏమి ఆశిస్తున్నారు అన్నది ఫక్తు కాంగ్రెస్ అభిమానుల ఆవేదన. రేవంత్ వచ్చాక కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉన్నా నేతల్లో ఆవేదన ఉంది. పార్టీలు మారడం గతంలో అంత సీరియస్ విషయం కాదు ఇపుడు. అందుకే అవి సర్వసాధారణం అయిపోయాయి. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరూ శాశ్వతం కారు అన్న ధోరణిలో కాంగ్రెస్ తో సహా అన్ని కీలక పార్టీలలోనూ రాజకీయం నడుస్తోంది.
ఏ విధంగా చూసుకున్నా వంద కోట్లకు పైగా ఖర్చయ్యే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే చర్చోపచర్చలు సాగుతున్న తరుణాన కాంగ్రెస్ ను ఎప్పటి నుంచో నమ్ముకుని ఉన్న మర్రి శశిధర్, దాసోజు శ్రవణ్ లాంటి కీలక నాయకులు గుడ్ బై చెప్పేయడం ఓ విధంగా ఆ పార్టీకి కొంచెం ఇబ్బందే. అయితే... మర్రి శశిధర్ కి పార్టీ ఎన్నో పదవులు ఇచ్చినా... కేవలం ఒక పేరు చెప్పి పార్టీ వీడటం కాంగ్రెస్ శ్రేణులకు నచ్చడం లేదు.
కాంగ్రెస్ కన్నా వేగంగా రాజకీయాలు చేయడంలో దిట్టగా పేరొందిన బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ తమ తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కానీ కాంగ్రెస్ లో మాత్రం అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతున్నాయి అన్న వాదనలకు బలం ఇచ్చేలానే పరిణామాలు ఉంటున్నాయి.
ఆ విధంగా రేవంత్ హవాకు చెక్ పెట్టే వ్యూహాలు కొన్ని ప్రత్యర్థి వర్గాలు చేస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో స్థానిక నాయకులు హాయిగా తమకు తోచిన రీతిన అమ్ముడుపోతున్నారు అన్న వాదనకు బలం చేకూరుస్తూ పరిణామాలు ఉంటున్నాయి.