Begin typing your search above and press return to search.
చిన్నమ్మ దోస్తి కట్టిందని దోషికి కొత్త శిక్ష
By: Tupaki Desk | 22 Feb 2017 12:42 PM GMTఅన్నాడీఎంకే అధినేత్రి శశికళ ఎఫెక్ట్ తమిళనాడు రాజకీయాలకు మాత్రమే పరిమితం కాలేదు.ఆమె జైల్లో ఉన్నప్పటికీ పవర్ ఫుల్ లేడీ అనే గుర్తింపును పొందుతోంది. శశికళ ఉంటున్న సెల్ పక్కనే సైనేడ్ మల్లిక అనే సీరియల్ కిల్లర్ ఉందన్న వార్తలు గతవారం హల్‌చల్ చేశాయి. అయితే ఇప్పుడా సైనేడ్ మల్లిక అలియాస్ కేడీ కెంపమ్మను బెలగావిలోని హిందాల్గా జైలుకు షిఫ్ట్ చేశారు. శశికళతో సన్నిహితంగా ఉంటున్నదనే ఆమెను జైలు మార్చినట్లు పరప్పన అగ్రహార జైలు అధికారులు వెల్లడించారు. శశికళ జైలుకొచ్చినప్పటి నుంచి ఆమెతో మల్లిక చాలా సన్నిహితంగా ఉంటున్నదని జైలు అధికారులు తెలిపారు. ఆమెను భోజనం కోసం కూడా క్యూలో నిల్చోనిచ్చేది కాదని, శశికళ దగ్గరికే మల్లిక భోజనం తెచ్చి ఇచ్చేదని ఓ అధికారి చెప్పారు.
ఇంతటి ప్రత్యేక ఆసక్తి జైలు అధికారులను అప్రమత్తం చేసింది. భద్రతా కారణాలు చూపుతూ గతవారమే మల్లికను మరో జైలుకి తరలించారు. కనీసం మల్లికకు కూడా ముందుస్తు సమాచారం ఇవ్వకుండా అప్పటికప్పుడు లగేజీ సర్దుకోవాల్సిందిగా అధికారులు సూచించినట్లు సమాచారం. ఆరుగురు మహిళలను విషం పెట్టి చంపినట్లు మల్లికపై ఆరోపణలు ఉన్నాయి. దేశంలోనే మొదటి మహిళా సీరియల్ కిల్లర్ గా పేరున్న మల్లికను 2008లో అరెస్ట్ చేశారు. ఓవైపు శశికళను చెన్నైకి తరలించే ప్రయత్నంలో ఆమె లాయర్లు ఉండగానే.. మరోవైపు మల్లికను బెలగావి జైలుకు అధికారులు తరలించడం గమనార్హం. బెలగావిలోని హిండాల్గా జైలు దేశంలోని పురాతన జైళ్లలో ఒకటి. ఇక్కడ హత్యానేరం ఉన్న ఖైదీలే వందల సంఖ్యలో ఉన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/