Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ పెరోల్‌...సింపుల్‌ గా నో చెప్పేశారు

By:  Tupaki Desk   |   3 Oct 2017 5:54 PM GMT
చిన్న‌మ్మ పెరోల్‌...సింపుల్‌ గా నో చెప్పేశారు
X

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత నెచ్చెలి - పరప్పణ జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు మ‌రో దుర్వార్త‌. ఇప్ప‌టికే శశికళ అక్క కుమారుడు దిన‌క‌ర‌న్‌పై కేసు న‌మోద‌వ‌గా...తాజాగా ఆమె భర్త నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా చెన్నైలోని జీజీ ఆసుపత్రి వ‌ర్గాలు వెల్ల‌డించారు. మూత్రపిండాలు - కాలేయం ఫెయిలూర్స్ కావడంతో ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా, తన భర్త ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తనకు పెరోల్‌ ఇవ్వాలని కోరుతూ శశికళ కర్ణాటకలోని పరప్పణ‌ అగ్రహార జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దీనిని జైలు అధికారులు రేపు పరిశీలించి అనుమతి మంజూరు చేసే అవకాశం ఉందని స‌మ‌చారం.

తీవ్ర అస్వ‌స్థ‌త‌తో ఇబ్బందిప‌డ్డ న‌ట‌రాజ‌న్‌ తొమ్మిది నెలలుగా ఆయన చెన్నైలోని జీజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.‘నటరాజన్‌‌ కు ప్రస్తుతం లివర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ లో చికిత్స అందిస్తున్నాం. ప్రొపెసర్ మహమ్మద్ రేలా సారథ్యంలో వైద్యం జరుగుతోంది. మూత్రపిండాలు - కిడ్నీ చెడిపోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది’ అని జీజీ ఆసుపత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. లివర్ ఫంక్షన్ దిగజారిపోతోందని, లివర్ - కిడ్నీ మార్పిడి కోసం ఆయన ఎదురుచూస్తున్నారని తెలిపింది. కాగా, శశికళ దాఖలు చేసిన పిటిషన్‌ పరిశీలనలో ఉందని జైలు అధికారులు వెల్లడించారు. ఈ నెల 5వ తేదీన పెరోల్‌ వచ్చే అవకాశాలున్నాయని వారన్నారు.

కాగా, శ‌శిక‌ళ అక్క కుమారుడు దిన‌క‌ర‌న్ చిక్కుల్లో ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ - తమిళనాడు సీఎం పళనిస్వామిల ప్రతిష్ఠకు భంగం కలిగేలా కరపత్రాలను ముద్రించి పంపిణీ చేయ‌డంపై ఏఐఏడీఎంకే తిరుగుబాటు నేత దినకరన్‌తోపాటు ఈ 10మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం సీఎం పళనిస్వామి అధికారులతో సమావేశం నిర్వహిస్తుండగా సమావేశ మందిరం బయట పలువురు ఈ కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. దీనిని గుర్తించిన వినాయకమ్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా తిరుచిరాపల్లి ఎంపీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రవర్తించినందుకు దినకరన్‌ పై కేసు నమోదైంది.