Begin typing your search above and press return to search.
మోడీ నోట్ల రద్దు.. శశికళకొన్న ఆస్తుల చిట్టా ఇదీ
By: Tupaki Desk | 22 Dec 2019 2:30 PM GMTపెద్ద నోట్ల రద్దుతో మోడీ ఏం సాధించాడయ్యా అంటే ఏమీ లేదన్న విమర్శ ఉంది. నల్లడబ్బును వెలికితీస్తానని ఈ మహాయజ్ఞం చేసిన పెద్ద మనిషికి మార్కెట్లో నల్లడబ్బు అయితే దొరకలేదు. పేదలు, మధ్యతరగతి వారు జేబుల్లో పాత నోట్లు పెట్టుకొని బ్యాంకుల ముందు క్యూలు కట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు. పోనీ నల్లడబ్బు దాచుకున్న వారు ఆ డబ్బును అంతా పారబోసి దొరికిపోయారా అంటే అదీ లేదు.
తాజాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ కేసులో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. జయలలిత ఆస్తులన్నింటిని తనవద్దే ఉంచుకొని అధికారం చెలాయిద్దామని చూసిన ఈమెను మోడీ సర్కారు అక్రమార్కుల కేసులో ఇరికించి జైలుకు పంపిందనే అపవాదు ఉంది.
తాజాగా ఈ కేసులో నమ్మలేని నిజాలను అధికారులు బయటపెట్టారు. శశికళ సరిగ్గా మోడీ నోట్ల రద్దు చేసినప్పుడు తన దగ్గరున్న నల్లడబ్బుతో భారీ ఎత్తున ఆస్తులను కొనుగోలు చేసిందని తేలింది. చెన్నై, మధురై, పెరంబూర్ లలో శశికళ షాపింగ్ మాల్స్ ను కొనేసింది. అంతేకాదు ఏకంగా చెన్నైలో ఒక షుగర్ మిల్, ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ.. పాండిచ్చేరిలో ఒక రిసార్ట్, కోయంబత్తూర్ లో పేపర్ మిల్ కొనేసిందట.. ఇవే కాదు.. ఏకంగా కోయంబత్తూరులో 50 విండ్ పవర్ ప్లాంట్ లు కొనేసిందట.. ఈ ఆధారాలను కోర్టుకు సమర్పించిన అధికారుల డేటా చూసి మీడియా, తమిళ జనాలు షాక్ అయ్యారట..
జయలలిత నెచ్చలిగా పేరున్న ఈమె ఇంత నల్లడబ్బు కలిగి ఉండడం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. దీన్ని బట్టి మోడీ నోట్ల రద్దుతో సామాన్యులే బ్యాంకుల ఎదుట క్యూలు కట్టి విలవిలలాడారని.. డబ్బున్న పెద్దలంతా ఇలా ఆస్తులు కొనేసారని అర్థమవుతోంది.