Begin typing your search above and press return to search.

జయ మరణంపై శశికళ సోదరుడి సంచలన ప్రకటన

By:  Tupaki Desk   |   18 Jan 2018 9:06 AM GMT
జయ మరణంపై శశికళ సోదరుడి సంచలన ప్రకటన
X
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 2016 డిసెంబరు 5న మరణించిన సంగతి తెలిసిందే. అప్పటికే కొన్ని నెలలు ఆసుపత్రికే పరిమితమైన ఆమె చికిత్స పొందుతూ మరణించారు. అయిత... అందరూ అనుకుంటున్నట్లు ఆమె డిసెంబరు 5న మరణించలేదని.. డిసెంబరు 4నే మరణించారని శశికళ సోదరుడు తాజాగా చెప్పడం సంచలనంగా మారింది.

జయ మృతిని ఒకరోజు పాటు రహస్యంగా దాచి పెట్టారని శశికళ సోదరుడు వి దివాహరన్‌ చెప్పారు. తిరువారూర్‌ లోని మన్నార్‌ గుడిలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జయలలిత 2016 డిసెంబర్‌ 4వ తేదీన మరణించారని అన్నారు. అయితే ఆసుపత్రి అధికారులు ఆ మరుసటి రోజు ఆమె మరణించినట్లు ప్రకటించారని, ఆసుపత్రిపై దాడి జరుగుతుందనే భయంతో జయలలిత మరణించిన వెంటనే ప్రకటించలేదని ఆయన అన్నారు.

జయలలిత డిసెంబర్‌ 4వ తేదీ సాయంత్రం 5 గంటల 15 నిముషాలకు తుదిశ్వాస విడిచారని ఆయన సమయంతో సహా వెల్లడించారు. ఆ విషయం తెలిసి తాను ఆసుపత్రికి వెళ్లానని, జయలలితను వెంటిలేటర్‌ పైనే ఉంచారని ఆయన అన్నారు. ఇంకా వెంటిలేటర్‌ ఎందుకని ఆసుపత్రి ఛైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డిని ప్రశ్నించానని, ఆసుపత్రికి ఏమీ కాకూడదని - సెక్యూరిటీ ఏర్పాటు చేస్తే ఆమె మరణించినట్లు ప్రకటించగలనని ఆయన అన్నారని దివాహరన్‌ చెబుతున్నారు.