Begin typing your search above and press return to search.
పన్నీర్ ను పార్టీ నుంచి వేటేసిన చిన్నమ్మ
By: Tupaki Desk | 14 Feb 2017 8:12 AM GMTగడిచిన ఎనిమిది రోజులకు పైగా సా..గుతున్న అన్నాఢీఎంకే అంతర్గత సంక్షోభం క్లైమాక్స్ కు వచ్చేసినట్లే చెప్పాలి. నిన్నమొన్నటి వరకూఆచితూచి అడుగులు వేసిన చిన్నమ్మ.. ఇప్పుడు తన కత్తికి మరింత పదును పెడుతున్నారు. రిసార్ట్స్ నుంచి నేరుగా జైలుకే వెళ్లే అవకాశాలు ఉండటంతో.. తాను జైలుకు వెళ్లే లోపు ఏమేం చేయాలో.. అన్నిపనుల్ని చకచకా పూర్తి చేస్తుండటం కనిపించింది.
తనపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన పన్నీర్ సెల్వంను అన్నాడీఎంకే కోశాధికారి పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో.. ఆమె మరింత కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. పన్నీర్ సెల్వంను అన్నాడీఎంకేపార్టీ ప్రాధమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసిన ఆమె.. అన్నాడీఎంకేకు.. పన్నీర్ కు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు. మరి.. దీనికి పన్నీర్ వర్గం ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/