Begin typing your search above and press return to search.
అమ్మ గుర్తుకొచ్చేలా చేసిన చిన్నమ్మ
By: Tupaki Desk | 27 Jan 2017 6:45 AM GMTచిన్నమ్మ చిన్నమే. అమ్మతో పాటు ఏళ్ల తరబడి దగ్గరున్నఆమెకు.. ఏ విషయం మీద ఎప్పుడు.. ఎలా వ్యవహరించాలో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదన్నమాటకు తగ్గట్లే తాజాగా ఆమె తీరు ఉంది. అమ్మ మాదిరి తొందరపాటుతో వ్యవహరించకుండా.. ఆచితూచి అడుగులు వేస్తున్న ఆమె.. అధికారం కోసం తాను తహతహలాడటం లేదన్నసంకేతాల్ని స్పష్టంగా పంపించే ప్రయత్నం చేస్తున్నారు.
అమ్మ తర్వాత చిన్నమ్మ హోదా ఏవిధంగా అయితే తనకు వచ్చేసిందో..పవర్ సైతం అదే రీతిలో తనకు బదిలీ కావాలని భావిస్తున్నారు. అధికారం మాత్రమే చేతికి వస్తే.. అది మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలే ప్రమాదం ఉండటంతో ప్రజాభిమానం మీదనే ఆమె ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తోంది. విధేయుడైన పన్నీరు సెల్వంను తప్పించేసి.. సీఎం కుర్చీలో కూర్చోవటానికి చిన్నమ్మ విపరీతంగా తపిస్తున్నారన్న చెడ్డపేరుతెచ్చుకోవటానికి తాను సిద్ధంగా లేనన్న విషయాన్ని తాజాగా మరోసారి రుజువు చేశారని చెప్పాలి.
గురువారం జరిగిన రిపబ్లిక్ డే వేడుకులకు దూరంగా ఉన్న ఆమె.. వ్యూహాత్మకంగానే రాలేదని చెబుతున్నారు. జల్లికట్టు ఎపిసోడ్ లో భాగంగా ఈ నెల23న తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైన వేళ.. అసెంబ్లీకి చిన్నమ్మ వస్తారని.. గ్యాలరీలో కూర్చుంటారని భావించారు. కానీ.. ఆ అంచనాల్ని వమ్ము చేస్తూ ఆమె అసెంబ్లీ ముఖం కూడా చూడలేదు. ఎందుకన్న సందేహం చాలామందికి వచ్చింది.
కొద్దిమంది సన్నిహితులు ఉత్సుకత ఆపుకోలేక.. ఆమె దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించిన వేళ.. ఆమె సమాధానం విన్న వారంతా చిన్నమ్మ పరిణితికి అచ్చెరువు వొందినట్లుగా చెబుతున్నారు. తాను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి అడుగుపెడతాను కానీ.. అప్పటివరకూ అటువైపు కన్నెత్తి కూడా చూడనని చెప్పినట్లుగా చెబుతున్నారు. సీఎంపదవిలోకి రావాలని ఉన్నా.. ఇప్పటికిప్పుడు కాదన్నక్లారిటీతో ఆమె వేస్తున్న అడుగులు చూస్తే..చిన్నమ్మ తీరు కాస్తంత అమ్మ మాదిరి ఉన్నట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/