Begin typing your search above and press return to search.
షాకింగ్ న్యూస్: శశికళ భర్త కన్నుమూత
By: Tupaki Desk | 20 March 2018 4:39 AM GMTతమిళనాడు చిన్నమ్మ శశికళకు పెద్ద కష్టమే వచ్చి పడింది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె భర్త నటరాజన్ (73) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళ.. భర్త తీవ్ర అనారోగ్యం దృష్ట్యా.. కోర్టు అనుమతితో ఆ మధ్యన పెరోల్ మీద బయటకు వచ్చారు. రెండు.. మూడు రోజులు భర్తతో ఉన్న ఆమె తిరిగి జైలుకు వెళ్లారు.
మూత్రపిండాల వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా రెండు రోజులుగా మార్తలు వస్తున్నాయి. ఈ తెల్లవారుజామున నటరాజన్ మరణించినట్లుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గతంలో ప్రజా సంబంధాల అధికారిగా పని చేసిన నటరాజన్.. 1975లో శశికళను వివాహమాడారు.
విద్యార్థి దశలో హిందీ వ్యతిరేక పోరాటాల్లో పాల్గొన్న ఆయన.. డీఎంకేలో చురుకైన పాత్రను పోషించారు. అమ్మ జయలలితకు కొంతకాలం రాజకీయ సలహాదారుగా వ్యవహరించారు. అయితే.. తన తీరు నచ్చకపోవటంతో జయలలిత తర్వాతి రోజుల్లో ఆయన్ను దూరంగా ఉంచారు.
తన నెచ్చెలి శశికళతో సన్నిహితంగా ఉన్నప్పటికీ.. పోయెస్ గార్డెన్ లోని తన నివాసానికి నటరాజన్ ను జయ రానిచ్చేవారు కాదని చెబుతారు. విషాదకరమైన విషయం ఏమిటంటే.. తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన భర్తను చూసేందుకు శశికళ సోమవారం పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తు విచారణలో ఉన్నంతనే.. భర్త మరణం శశికళకు భారీ దెబ్బగా చెప్పక తప్పదు. గత అక్టోబరులో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న నటరాజన్.. తర్వాతి నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. రెండు వారాల క్రితం మరోసారి అనారోగ్యానికి గురైన ఆయన.. చెన్నై గ్లోబల్ ఆసుపత్రిలో చేరారు. భర్త మరణం చిన్నమ్మకు తీరని శోకంగా చెప్పక తప్పదు. వందలాది కోట్ల సంపద ఉన్నా.. కట్టుకున్న భర్తకు అనారోగ్యంగా ఉన్న వేళ.. దగ్గరుండి చూసుకునే ఛాన్స్ లేని హోదా.. ప్రముఖురాలన్న ట్యాగ్ లైన్లు అవసరమా? అన్న భావన కలగక మానదు.