Begin typing your search above and press return to search.
అమ్మ పోయాకే ఆయన పోయెస్ లోకి ఎంట్రీ!
By: Tupaki Desk | 7 Dec 2016 7:30 AM GMTతనకు నచ్చని వారి విషయంలో అమ్మ జయలలిత ఎంత కరుకుగా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తన ప్రాణస్నేహితురాలు శశికళను సైతం కొన్ని సందర్భాల్లో చెక్ పెట్టే విషయం తెలిసిందే. అయితే.. ఆమె విషయంలో కాస్త రిలాక్సేషన్ ఇచ్చే అమ్మ.. శశికళ భర్త విషయంలో మాత్రం చివరికంటా కరకుగానే ఉండేవారు. అమ్మ వెంట అనుక్షణం కనిపించే శశికళకు ఒక కుటుంబం ఉంది. ఆమె భర్త ఐఆర్ ఎస్ అధికారి. తన భార్య జయలలితకు క్లోజ్ అయ్యాక.. ఆమె పేరుతో పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకునేవారు.
ఇలాంటివి ఎంతమాత్రం ఇష్టపడని జయలలిత ఆయన్ను దూరంగా పెట్టేశారు. ఎంతలా అంటే.. ఆయనకు తన నివాసమైన పోయెస్ గార్డెన్ లోకి రానిచ్చేవారు కాదు. దీంతో.. ఆయన దూరంగానే ఉండిపోయారు. అపోలో ఆసుపత్రిలో అమ్మ ఆఖరి శ్వాస ఆగిన తర్వాత మాత్రమే శశికళ భర్త నటరాజన్ పోయెస్ గార్డెన్ లోకి అడుగు పెట్టే సాహసం చేశారని చెప్పాలి.
అమ్మ పార్థిపదేహాన్ని అపోలో నుంచి పోయెస్ గార్డెన్ కు తీసుకొచ్చిన వేళ.. భార్య శశికళ వెంట ఉన్న ఆయన.. అనంతరం రాజాజీ హాలుకు తరలించే సమయంలోనూ.. అంతిమ సంస్కారాల సమయంలోనూ ఉన్నారు. తాజాగా ఆయన ఎంట్రీ నేపథ్యంలో త్వరలో ఆయన అన్నాడీఎంకేలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే.. అన్నాడీఎంకే పార్టీలో సమీకరణాలు మరింత మారే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/