Begin typing your search above and press return to search.

అంతా చెడగొట్టావ్... శశికళకు భర్త చీవాట్లు

By:  Tupaki Desk   |   12 Feb 2017 4:05 AM GMT
అంతా చెడగొట్టావ్... శశికళకు భర్త చీవాట్లు
X
సీఎం పీఠం కోసం ఆశపడి చేతులు కాల్చుకుంటున్న శశికళకు ఇప్పటికే ఊహించని పరాభవాలతో షాక్ ల మీద షాక్ లు తగులుతుంటే తాజాగా ఆమె భర్త నుంచి కూడా గట్టి షాకే తగిలిందట. చెప్పిన మాట వినకుండా తొందరపడడం వల్ల వ్యవహారమంతా చెడిపోయిందంటూ నటరాజన్.. శశికళను ఫుల్లుగా క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. మరికొద్ది కాలం పన్నీర్ సెల్వంనే కొనసాగించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని.. తరువాత ప్రజల్లో, పార్టీలో సానుభూతి తెచ్చుకుని ఈ స్టెప్ వేసి ఉంటే బాగుండేదని ఆయన అన్నట్లు శశికళ వర్గం నుంచే లీకులు వచ్చాయి.

అంతేకాదు.. తాజాగా శశికళ తాను రేసు నుంచి తప్పుకుని పొంగొట్టియన్ పేరు తెరపైకి తేవడాన్ని కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారట. ఇంతవరకు వచ్చాక మడమ తిప్పితే పరువు పోతుందని.. ఆటను మధ్యలో వదిలేయడం సరికాదని, ఇంత జరిగాక వెనక్కి తగ్గితే నవ్వులపాలవడం ఖాయమని నటరాజన్ ఆమెతో అన్నట్లు టాక్.

గవర్నర్‌ను కనుక ఒప్పించగలిగితే వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలు సైతం తిరిగి పరిగెత్తుకుంటూ వస్తారన్నది నటరాజన్ తాజా ప్లానట. అందుకుగాను ఇప్పుడు గవర్నరుతో కయ్యం పెట్టుకోకుండా, ఆయనపై తిరగబడకుండా, నిరసనలు తెలపకుండా బుద్ధిగా ఆయనతో మరోసారి భేటీ అయి జాగ్రత్తగా ఒప్పించాలని సూచించారట. గవర్నర్‌తో తాడోపేడో తేల్చుకోవాలని శశికళ నిర్ణయించుకోవడం.. ఒకదశలో శనివారం ఆమె గవర్నర్‌ తీరుకు వ్యతిరేకంగా జయ సమాధి వద్ద నిరసనకు సైతం దిగాలని భావించిన నేపథ్యంలో వెంటనే ఈ వార్నింగు ఇచ్చారట. దాంతో శశికళ వెనక్కు తగ్గినట్లు సమాచారం. శశికళపై రోజురోజుకు అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో ఆమె భర్త నటరాజన్ రంగంలోకి దిగి ఆమెకు చీవాట్లు పెట్టినట్లు చెబుతున్నారు.