Begin typing your search above and press return to search.
అమృత వెనుక చిన్నమ్మ?
By: Tupaki Desk | 6 Dec 2017 5:34 AM GMTథ్రిల్లర్ మూవీని తలపించేలా తమిళనాట సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కంటి ముందు కనిపించేవన్నీ నిజాలు ఏమాత్రం కావన్నట్లుగా పరిణామాలు ఏర్పడుతున్నాయి. రాజకీయ ఎత్తులు పైఎత్తుల నేపథ్యంలో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి.
ఇన్ని దశాబ్దాలుగా లేనిది ఒక్కసారిగా అమ్మ గతం తెర మీదకు వచ్చింది. ఆమె ప్రముఖ నటుడు శోభన్ బాబుతో సహజీవనం చేసిందన్న వార్త బ్యానర్ వార్తలుగా మారిపోయాయి. తన మీద జరిగే ప్రచారానికి ఏ మాత్రం సమాధానం చెప్పలేని వేళ.. అమ్మ మీద వస్తున్న వార్తలు సంచలనంగా మారుతున్నాయి.
శోభన్ బాబుతో అమ్మ సహజీవనం నిజమంటూ లాజిక్ చెప్పి మరీ వార్తలు వస్తున్న వేళ.. అమ్మకు నేనే అసలైన కూతుర్ని అంటూ అమృత అనే యువతి తెర మీదకు వచ్చారు. బెంగళూరుకు చెందిన అమృతే అమ్మ కూతురా? అన్న డౌట్ వస్తున్న వేళ.. కావాలంటే తన డీఎన్ ఏ నమూనాను తీసుకోవాలంటూ ఆమె సవాలు విసురుతున్నారు.
అమ్మకున్న రాజకీయ నేపథ్యంలో.. అమృత లాంటి ఒక సాదాసీదా అమ్మాయి ఎలా మాట్లాడుతుంది? ఆమె మాటలకు కొన్ని మీడియా సంస్థలు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నాయి? ఆమె ఎవరు? ఆమె వెనుక ఎవరు ఉన్నారు? అన్న ప్రశ్నలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి.
వీటికి కొంత సమాధానం చెప్పేలా కొంత సమాచారం బయటకు వచ్చింది. అమృత వెనుక ఉన్నది ఎవరో కాదని.. చిన్నమ్మేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. జైల్లో కూర్చొని చక్రం తిప్పే చిన్నమ్మ.. అమృతతో ఏం చేయాలనుకుంటున్నారు? ఆమె గేమ్ ప్లాన్ ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాను అమ్మ కుమార్తెనంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించటంతో పాటు.. కావాలంటే తనకు డీఎన్ ఏ పరీక్షలు నిర్వహించాలన్న అమృత మాటలకు స్పందించిన అత్యున్నత న్యాయస్థానం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా పేర్కొంది. ఇదిలా ఉంటే.. అమృత సుప్రీంకోర్టు వరకు ఎలా వెళ్లారు? ఆమెను నడిపిస్తున్నది ఎవరన్న లోతుల్లోకి వెళితే.. సుప్రీంకోర్టులో అమృత పిటిషన్ లో సంతకాలు చేసిన వారిలో ఆమె బంధువులైన లలిత.. రంజని ఉన్నారు.
లలిత విషయానికి వస్తే.. గతంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జయ ఆడపిల్లకు జన్మనిచ్చారని.. జయ ప్రసవం సమయంలో ఆమెకు సమీప బంధువైన రంజని ఉందన్నారు. ఇప్పుడా రంజని.. కొద్ది కాలం కిందట పరప్పన అగ్రహార జైల్లో ఉన్న చిన్నమ్మను కలవటం చర్చనీయాంశంగా మారింది. జైల్లో చిన్నమ్మను రంజని కలిసిన రికార్డును మీడియాలో అచ్చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
చిన్నమ్మ దర్శకత్వంలోనే రంజని.. అమృతను ఒక పద్ధతి ప్రకారం తెర మీదకు తీసుకురావటం చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందరూ చెప్పేలా అమ్మ కూతురు అమృత అయి ఉండొచ్చని.. ఇప్పుడు కోర్టును ఆశ్రయించటం ద్వారా.. ఆమె అమ్మ కుమార్తె అన్న విషయం రుజువైన పక్షంలో వందల కోట్ల అమ్మ ఆస్తులు అమృత పరమవుతాయి. మరి.. దీనంతటికి కారణమైన శశికళకు..ఆ ఆస్తుల్లో ఎంత ముడుతుందన్నది ఎవరి అంచనాలకు వారిని వదిలేయటం మంచిది. అయితే.. ఈ వాదనకు ఆధారాలు చూపించకపోవచ్చు. కానీ.. లాజిక్ గా చూస్తే మాత్రం.. అలా జరగటానికి అవకాశం ఉందన్నది మర్చిపోకూడదు. సో.. తెర మీదకు వచ్చిన అమృత వెనుక చిన్నమ్మ ఉన్నారన్న కొత్త సందేహానికి బలమైన సాక్ష్యాలు బయటకు రావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.