Begin typing your search above and press return to search.
ప్రత్యర్థులకు ఫోన్ కాల్ తో ఘాటు సందేశాన్ని పంపిన చిన్నమ్మ
By: Tupaki Desk | 11 Jun 2021 4:30 AM GMTతమిళనాడు విపక్షం అన్నాడీఎంకేను తన అధీనంలోకి తెచ్చుకోవటానికి చిన్నమ్మ శశికళ పెద్ద ఎత్తున పావులు కదుపుతున్నారు. అమ్మ మరణం తర్వాత పార్టీ చీఫ్ గా ఎంపికైన ఆమె.. అంతలోనే ఆ స్థానం నుంచి ఆమెను బలవంతంగా తప్పించటం.. అనంతరం పాత కేసులకు సంబంధించిన శిక్షను అనుభవించటం కోసం జైలుకు వెళ్లటం.. ఏళ్లుగా అక్కడే ఉండి.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళలో విడుదల కావటం తెలిసిందే. ఆమె రాకతో అన్నాడీఎంకేలో అలజడి ఖాయమన్న మాట వినిపించింది. అయితే.. అనూహ్యంగా రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమితో తల్లడిల్లుతున్న పార్టీని తన అధీనంలో తెచ్చుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు చిన్నమ్మ.రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఇటీవల కాలంలో పార్టీకి చెందిన నేతలతో గుట్టుచప్పుడు కాకుండా మంతనాలు జరుపుతున్నట్లుగా సమాచారం. ఇప్పటివరకు ఆమె 22 మంది అన్నాడీఎంకే నేతలతో ఫోన్ లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఆ సమయంలో ఆమె పార్టీ పేరును కూడా ప్రస్తావించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె పార్టీకి చెందిన మాజీ మంత్రి ఆనందన్ తో ఫోన్లో మాట్లాడిన కాల్ బయటకు వచ్చింది. ఐదు నిమిషాల పాటు మాట్లాడిన సందర్భంలో పార్టీపై ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పార్టీని రక్షించుకోవటానికి తాను వస్తున్నానని పేర్కొన్నారు. అన్నాడీఎంకే తన ఊపిరి అని.. దానిని తనను ఎవరూ దూరం చేయలేరని వ్యాఖ్యానించారు.
స్వర్గీయ ఎంజీఆర్ తర్వాత పార్టీని బలోపేతం చేయటం కోసం అమ్మతో కలిసి తాను ఎంతో కష్టపడినట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఈ విషయం ఎవరికి తెలీదన్నారు. అమ్మ జయలలితకు వచ్చేలేఖల్ని చదవి వినిపించటం.. వాటికి సమాధానాల్ని పంపటం తానే చేస్తుండేదానినని ఆమె చెప్పుకోవటం గమనార్హం. అయితే.. ఇప్పుడు అలా లెటర్లు చదువుతూ కూర్చునే పరిస్థితి లేదని పేర్కొన్నారు. మొత్తంగా అన్నాడీఎంకేలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పాలి.మరి.. ఆమెకు వైరి వర్గంగా ఉన్న పన్నీర్.. పళినిలు తాజా పరిణామంపై ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.