Begin typing your search above and press return to search.
పెరెల్ ముగిసేలోగా చిన్నమ్మ ఇవన్నీ చేసేసిందట
By: Tupaki Desk | 13 Oct 2017 4:38 AM GMTఅన్నాడీఎంకె నాయకురాలు శశికళ జైలు జీవితం చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ మొదలయింది. చెన్నై ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న భర్తను పరామర్శించేందకు ఐదు రోజుల పెరోల్‌పై వచ్చిన గడువు ముగియడంతో తిరిగి గురువారం బెంగళూరు సెంట్రల్ జైలుకు వచ్చింది. ఈ విషయాన్ని జైలు అధికారులు ధ్రువీకరించారు. ‘గురువారం సాయంత్రం 4.30 గంటలకు శశికళ జైలుకు వచ్చారు. ఆమెకు ఇచ్చిన గడువు లోపలే తిరిగి వచ్చారు’ అని జైళ్ల సూపరింటిండెంట్ జి సోమశేఖర్ తెలిపారు. శశికళ(60)కు ఈ నెల 6న పెరోల్ మంజూరవడంతో 12వ తేదీ అంటే గురువారం సాయంత్రంలోగా తిరిగి లొంగిపోవాలని జైళ్ల అధికారులు ఆదేశించారు. ఐదు రోజుల పెరోల్ సందర్భంగా ఆమె ఎలాంటి ఉల్లంఘనలు పాల్పడలేదని ఆయన అన్నారు.
పెరోల్ పై బయటకు వచ్చిన శశికళ చెన్నైలోని జినియాగ్లెస్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్తను పరామర్శించారు. శశికళ భర్త నటరాజన్ (74)కు కిడ్నీ - కాలేయ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. తన భర్తను చూడడానికి 15 రోజుల పెరోల్ మంజూరు చేయాలని శశికళ అభ్యర్థించగా, కొన్ని నిబంధనలతో ఐదు రోజులే మంజూరు చేశారు. పెరోల్ సందర్భంగా మీడియాతో మాట్లాడడం, లేదా రాజకీయ సమావేశాలకు హాజరవ్వడం చేయకూడదని షరతులు పెట్టారు. అక్రమ ఆస్తుల కేసులో శశికళ - ఇలవరసీ - విఎన్ సుధాకర్ లకు కోర్టు జైలుశిక్ష విధించింది. ముద్దాయిలందరూ ప్రస్తుతం బెంగళూరులోని పనప్పరం కేంద్ర కారాగారంలోనే శిక్ష అనుభవిస్తున్నారు. ఇలావుండగా, చెన్నై నుంచి శశికళ తిరిగి వెళ్లేటప్పుడు ట్రేడ్ సెంటర్ పాయింట్ వంటి చోట్ల పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చి ఆమె బాగా ఉండాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ అయిదు రోజుల పాటు అనేక మంది మహిళలు తమ శిశువులను తీసుకొని వచ్చి - పేర్లు పెట్టాల్సిందిగా శశికళను కోరారు. గురువారం నగరంలో అనేకచోట్ల ఆగిన తరువాత ఆమె కాన్వాయ్ బెంగళూరు హైవే మీదుగా సాగిపోయింది.
అయితే ఈ బ్రేక్ లోనే తన సన్నిహితులతో సమావేశాలు జరిపినట్లు సమాచారం. అక్క కుమారుడు దినకరన్ సహ కొందరు కుటుంబ సభ్యులతో శశికళ సమావేశం అయినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అన్నాడీఎంకేలోని పరిణామాలు చర్చించినట్లు సమాచారం.