Begin typing your search above and press return to search.
తమిళుల కోసం మోడీకి చిన్నమ్మ లేఖ
By: Tupaki Desk | 4 Jan 2017 12:30 PM GMTఏఐఏడీఎంకే అధినేత్రిగా బాధ్యతలు స్వీకరించిన శశికళ పరిపాలన, రాజకీయపరంగా తన పట్టు సాధించుకునేందుకు తమిళుల మనసు గెలుచుకోవడమే ప్రథమ-ప్రధాన చర్య అని భావించినట్లు ఉన్నారు. ఈ క్రమంలో తమిళుల ఆరాధ్య క్రీడ అయిన జల్లికట్టుపై స్పందించారు. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసి ఆటపై నిషేధాన్ని కొనసాగించాలని చిన్నమ్మ కోరారు. జల్లికట్టు నిషేధంపై పార్లమెంట్ లో రూపొందించిన చట్టాన్ని సవరించాలని ప్రధానమంత్రికి రాసిన లేఖలో శశికళ కోరారు.
ఈ సంర్భంగా రాజకీయ అంశాలను సైతం శశికళ ప్రస్తావించారు. జల్లికట్టుపై చట్టాలు తెలియకుండా స్టాలిన్ మాట్లాడుతున్నారని ప్రధానమంత్రి తీరును శశికళ తప్పుపట్టారు. కాంగ్రెస్-డీఎంకే హయాంలోనే జల్లికట్టును నిషేధించారని గుర్తు చేశారు. ఈ విషయాలు తెలియకుండా దురుద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన జల్లికట్టు విషయంలో సరైన విధంగా తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని శశికళ వివరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/