Begin typing your search above and press return to search.

ఆఖరి అస్త్రాన్ని బయటకు తీసిన చిన్నమ్మ

By:  Tupaki Desk   |   14 Feb 2017 7:03 AM GMT
ఆఖరి అస్త్రాన్ని బయటకు తీసిన చిన్నమ్మ
X
నాకు దక్కనిది నా ప్రత్యర్థికి ఎంతకూ దక్కకుడదన్న మొండితనంతో కూడిన పట్టుదల ఉంటుంది. సుప్రీం తీర్పుతో దెబ్బ తిన్న బెబ్బులిగా ఉన్న చిన్నమ్మ తన అమ్ములపొదిలో ఉన్న ఆఖరి అస్త్రాన్ని బయటకు తీసింది. ఇంతకాలం గుట్టుగా దాచిన ఆ అస్త్రంతో.. తనను ముప్పతిప్పలు పెట్టిన పన్నీర్ సెల్వంకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేయాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇంతకీ చిన్నమ్మ తీసిన ఆ ఆఖరి అస్త్రం ఏమిటంటే.. దీపక్ గా చెప్పాలి.

ఎవరీ దీపక్? ఎప్పుడూ విన్నట్లు లేదే? అని అనిపించొచ్చు. కానీ.. అమ్మఅంతిమ సంస్కారాల సమయంలో చిన్నమ్మ పక్కనే ఒక బొద్దుగా ఉండే కుర్రాడు కనిపించాడు. చాలామందికి పరిచయం లేని ఆ కుర్రాడు.. ఏకంగా చిన్నమ్మతో పాటు అమ్మ అంతిమ సంస్కారాల్లో పాల్గొనడటంతో ఎవరీ కుర్రాడన్న క్వశ్చన్ మార్క్ చాలామందిలో కనిపించింది.

ఆ కుర్రాడి పేరు దీపక్ అని.. చిన్నమ్మ మేనల్లుడన్న విషయం ఆ తర్వాత తెలిసిందే. అమ్మకు అసలుసిసలు వారసుడ్ని తానేనని చెప్పుకునే దీపకు స్వయాన అన్నగా దీపక్ ను చెప్పాలి. రాజకీయాలంటే ఏమాత్రం ఆసక్తి లేని ఇతడు.. అమ్మతోనూ.. చిన్నమ్మతోనూ చాలా దగ్గరని చెబుతారు. వ్యాపారాల మీదనే తప్పించి రాజకీయాల్ని అస్సలు పట్టించుకోని దీపక్ ను తన వారసుడిగా ప్రకటించేందుకు శశికళ పావులు కదుపుతున్నట్లుగా చెబుతున్నారు.

ఇప్పటివరకూ చిన్నమ్మ తానుకాకుంటే.. తన స్థానంలో అన్నాడీఎంకేకు చెందిన నేతల్ని ఎంపిక చేస్తారని చెప్పినప్పటికీ.. అందుకుభిన్నమైన వ్యూహాన్ని ఆమె అమలు చేయనున్నట్లు చెప్పాలి. అమ్మకు సొంత మేనల్లుడు కావటం.. రాజకీయాల మీద ఆసక్తి లేకపోవటం.. తనకు నమ్మినబంటుగా ఉండే దీపక్ ను కానీ..అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా చేసిన పక్షంలో.. పవర్ చేతిలో ఉండకపోయినా.. పవర్ ఉన్నట్లేనని చెప్పాలి.

అందుకే.. ఇంతకాలం దీపక్ ప్రస్తావన తీసుకురాని చిన్నమ్మ.. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే దీపక్ ను గోల్డెన్ బే రిసార్ట్స్ కు పిలిపించుకున్నారు. కొద్దిసేపటి క్రితం (మంగళవారం మధ్నాహ్నం 12.30 గంటల సమయానికి) రిసార్ట్స్ కు చేరుకున్నారు. తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలకు దీపక్ ను పరిచయం చేసి.. అతడ్ని శాసనసభాపక్ష నేతగా ఎంపిక చేసి.. ఆ వివరాల్ని గవర్నర్ కు పంపుతారని చెబుతున్నారు. అదే జరిగితే.. పన్నీర్ సీఎం కావాలన్న ఆశలు అడియాశలు అయ్యే అవకాశం ఉందని చెప్పాలి. వేరే నేతను అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. కానీ.. అమ్మ సొంత మేనల్లుడే సీన్లోకి వచ్చాక.. కప్పదాటు వైఖరిని అనుసరిస్తే.. అమ్మకే ద్రోహం చేసినట్లుగా ప్రజలు ఫీలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి.. మరో మాటకు అస్కారం లేకుండా మద్దతు ఇస్తారని భావిస్తున్నారు. మరీ..అస్త్రానికి పన్నీర్ వర్గం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/