Begin typing your search above and press return to search.
అధికారికం: అమ్మ పగ్గాలు చిన్నమ్మకు వచ్చేశాయ్
By: Tupaki Desk | 29 Dec 2016 6:45 AM GMTసర్ ప్రైజ్ ల్లేవు. షాకుల్లేవు. అనుకున్నది అనుకున్నట్లే పూర్తి అయ్యింది. అమ్మ స్థానం ఇక చిన్నమ్మదేనని తేలిపోయింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా చిన్నమ్మ అలియాస్ అమ్మ నెచ్చెలి శశికళను ఎన్నుకుంటూ పార్టీ నిర్ణయం తీసుకుంది. అమ్మ బతికి ఉన్నంత కాలం ఆమె చేతుల్లో ఉన్న పార్టీ పగ్గాలు.. ఆమె తర్వాత చిన్నమ్మ చేతికే వస్తాయన్న అంచనాలు బలంగా వినిపించినప్పటికీ.. ఏదో జరుగుతుందన్న ఊహాగానాల మధ్య కాసింత ఉత్కంఠ వాతావరణం చోటు చేసుకుంది.
అయితే.. ఆ ఊహాగానాల్లో ఎలాంటి నిజం లేదన్న విషయాన్ని తేల్చేస్తూ.. గురువారం ఉదయం అన్నాడీఎంకేపార్టీ కార్యవర్గం సమావేశమైంది. ఈ సమావేశానికి ముందే అమ్మ తర్వాత చిన్నమ్మే తమ అధినేత్రి అన్న విషయాన్ని తెలియజేస్తూ.. పెద్ద ఎత్తున పోస్టర్లు.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం ద్వారా.. ఏం జరగనుందన్న విషయం అర్థమయ్యేలా చేసింది. ఇక.. పార్టీ కార్యవర్గ సమావేశంలో వేదిక మధ్యనున్న అమ్మ ఫోటోను ఏర్పాటు చేసి.. అమ్మ‘సాక్షి’గా చిన్నమ్మకు అధికార బదిలీ కార్యక్రమాన్ని చేపట్టారు.
ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతో పాటు మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు మొత్తం 23 మంది చిన్నమ్మకు పార్టీ పగ్గాలు అప్పజెప్పాలంటూ ప్రతిపాదనను పెట్టారు. దీనికి కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చిన్నమ్మ పరోక్షంలో ఇదంతా జరిగింది. పార్టీ పగ్గాలు చిన్నమ్మకు అప్పజెప్పిన విషయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మీడియా వద్దకు వచ్చి.. తన చేతిలో ఉన్న రాతప్రతిని పట్టుకొని చదువుతూ తాము తీసుకున్ననిర్ణయాన్ని ప్రకటించారు.
పార్టీ పగ్గాలు చిన్నమ్మకు అప్పచెబుతూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి సెల్వం స్వయంగా పోయెస్ గార్డెన్ కు వెళ్లి పార్టీ చీఫ్ కు శుభాకాంక్షలు చెప్పటంతో పాటు.. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వివరించనున్నారు. ఆమెను పార్టీ పగ్గాలు స్వీకరించాల్సిందిగా కోరనున్నారు. తమిళరాజకీయాల్లో అమ్మ శకం స్మృతిగా మారి.. ఇక.. చిన్నమ్మే జేజమ్మగా మారనుంది. పార్టీ దండంతో ఆమె ఊరుకుంటారా? సీఎం సీటులో కూర్చోవాలన్న కోరికను తీర్చుకుంటారా? అన్నది కాలమే చక్కటి సమాధానం ఇస్తుందనటంలో సందేహం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/