Begin typing your search above and press return to search.

చిన్నమ్మ చుట్టు బిగుసుకుంటున్న ఉచ్చు

By:  Tupaki Desk   |   1 May 2022 6:30 AM GMT
చిన్నమ్మ చుట్టు బిగుసుకుంటున్న ఉచ్చు
X
తమిళనాడులోని కొడనాడు ఎస్టేట్ కేంద్రంగా జరిగిన మరణాల్లో చిన్నమ్మగా పాపులరైన శశికళ చుట్టు ఉచ్చు బిగుసుకుంటున్నట్లే ఉంది. ఈమధ్యనే కొడనాడు మరణాలకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం శిశికళను ఆమె ఇంట్లోనే సుమారు 3 గంటలపాటు విచారించింది. ఇప్పటివరకు మరణాలకు సంబంధించి సాక్ష్యులు, ప్రత్యక్ష్యసాక్ష్యులు సుమారు 220 మందిని విచారించినట్లు ఐజీ సుధాకర్ తెలిపారు.

దివంగత జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ చాలా ఫేమస్. ఎప్పుడైనా వేసవికాలంలో వచ్చి జయ ఇక్కడ కొద్దిరోజులుండేవారు. అందుకనే ఈ ఎస్టేట్ బాగా పాపులరైంది. ఆమె మరణం తర్వాత ఎస్టేట్ ను జయకు అత్యంత సన్నిహితురాలిగా మెలిగిన శశికళ సొంతం చేసుకోవాలని కుట్రలు పన్నినట్లు ఆరోపణలున్నాయి. ఇందులో ఏది నిజమో తెలుసుకునేందుకు ఆదాయపు పన్నుశాఖ అధికారులు చిన్నమ్మ ఇంటిపైన, ఆస్తులపైన దాడులు జరిపారు. ఈ నేపధ్యంలోనే కొడనాడు ఎస్టేల్ లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ చనిపోయాడు.

అలాగే జయకు డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తి తర్వాత కొడనాడులో పనిచేసే మరోవ్యక్తి కూడా చనిపోయాడు. అంతకుముందు ఎస్టేట్ లో దొంగలుపడి విలువైన డాక్యుమెంట్లు, కంప్యూటర్లను ఎత్తుకెళ్ళినట్లు కేసు నమోదైంది. ఇదే సమయంలో సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎస్టేట్ వాచ్ మెన్ కూడా హత్యకు గురయ్యాడు. ఇదంతా చూసిన తర్వాత వరుస మరణాలపై పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే చనిపోయిన వాళ్ళంతా చిన్నమ్మకు బాగా సన్నిహితులనే ప్రచారం జరుగుతోంది.

దాంతో అందరి అనుమానాలు శశికళమీదకే మళ్ళాయి. దొంగతనం చేశారనే అనుమానం ఉన్నవారు వరుసగా చనిపోవటం, కేసుల దర్యాప్తులో విపరీతమైన అడ్డంకులు వస్తుండటంతో పోలీసులకు ఏమి చేయాలో దిక్కుతోచలేదు. ఈ నేపధ్యంలోనే తమిళనాడులో ఎన్నికలు జరిగాయి. అప్పటివరకు అధికారంలో ఉన్న ఏఐఏడిఎంకే స్ధానంలో డీఎంకే అధికారంలోకి వచ్చింది. స్టాలిన్ ముఖ్యమంత్రి కాగానే కొడనాడు ఎస్టేట్ లో దొంగతనాలు, మరణాలు, చిన్నమ్మపై ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఇపుడా బృందమే ఎస్టేట్ కేసును దర్యాప్తుచేస్తోంది. మరి మరణాల మిస్టరీ ఎప్పుడు వీడుతుందో చూడాలి.