Begin typing your search above and press return to search.
నేనే జయలలిత: అమ్మ స్థానంలోకి చిన్నమ్మ
By: Tupaki Desk | 31 Dec 2016 8:59 AM GMTఅన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈరోజు శశికళ బాధ్యతలు స్వీకరించారు. పోయెస్ గార్డెన్ నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు ఆమె జయలలిత కారునే ఉపయోగించారు. పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు ‘చిన్నమ్మ..చిన్నమ్మ’ అంటూ నినాదాలు చేశారు. శశికళ ఫొటోలు - నినాదాలు ఉన్న టీ-షర్టులను ధరించారు. కాగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రసంగించిన శశికళ - జయలలితను తలుచుకుంటూ కన్నీరుపెట్టారు.
శశికళ మాట్లాడుతూ - ‘అమ్మ’ జయలలిత ఆశయాల బాటలోనే నడుస్తానని, ఆమె ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తానని చెప్పారు. జయలలిత మరణిస్తారని కలలో కూడా ఊహించలేదని, ఆమె ఆరోగ్యం మెరుగుపడిన తరుణంలో ఆమెకు మళ్లీ గుండెపోటు వచ్చిందని అన్నారు. దేశ - విదేశాలకు చెందిన వైద్యులు జయలలితకు వైద్యం అందించారని, అయినా, ఆమె ఆరోగ్యం మెరుగుపడలేకపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు.
జయలలిత మరణంతో సర్వం కోల్పోయానని, 33 సంవత్సరాలు ఆమెతో కలిసి జీవించానని, ఆమె లేని లోటు జీర్ణించుకోలేకపోతున్నానని వాపోయారు. జయలలిత రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కలిసి సాగానని శశికళ అన్నారు. కాగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు స్వీకరించిన ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం, పార్టీ నేతలు - తదితరులు హాజరయ్యారు. అయితే.. జయ పథకాలు కొనసాగిస్తానని శశికళ చెప్పడంతో ఆమె సీఎం పదవి చేపట్టడానికి ఎంతో సమయం పట్టదన్న వాదన మరోసారి బలపడింది. శశికళ జయ స్నేహితురాలిగా - పార్టీనేతలా కాకుండా ముఖ్యమంత్రిలా మాట్లాడారని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/