Begin typing your search above and press return to search.
చిన్నమ్మ రోజు కూలీ రూ.50 మాత్రమే
By: Tupaki Desk | 15 Feb 2017 2:40 PM GMTకాస్త తేడా వచ్చింది కానీ.. సీఎం కావాల్సిన శశికళ పరిస్థితి ఎలా మారిందో తెలిపే ఉదంతమిది. నిన్నటివరకూ రాజభోగాలు అనుభవించిన ఆమె.. నేటి రాత్రి నుంచి ఆమెకు అసలుసిసలుకష్టాలు ఎదురుకానున్నాయి. జైలు నాకు కొత్త కాదు.. నేను సింహం లాంటిదాన్ని అంటూ ఘీంకరించిన శశికళ.. చివరకు జైలుకు షిఫ్ట్ అయ్యారు. అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆమె పరప్పణ అగ్రహార జైల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు ఎదుట లొంగిపోయారు.
ఈ సందర్భంగా తనను ప్రత్యేకంగా చూడాలంటూ కోరిన శశికళ విన్నపాన్ని కోర్టు ఒప్పుకోలేదు. ఆమెను సాధారణ ఖైదీలా మాత్రమే చూస్తామని తేల్చి చెప్పారు. తనకు ఏసీ గది.. విడిగా సెల్.. వ్యక్తిగత సహాయకురాలు.. ఇంటి భోజనం.. వేడి నీళ్లు.. మినరల్ వాటర్ ఇవ్వాలంటూ కోర్కెల జాబితాను కోర్టుకు రాక ముందే పెట్టుకున్న ఆమె అభ్యర్థులకు నో చెప్పేశారు.
మిగిలిన ఖైదీల మాదిరి ఆమెను ట్రీట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిన్న మొన్నటి వరకూ రాజభోగాలు అనుభవించిన ఆమె.. నేడు మొత్తం పరిస్థితి తలక్రిందులుగా మారింది. అయినప్పటికీ శశికళ ఏ మాత్రం తగ్గలేదట. శిక్ష వివరాల్ని వెల్లడించిన తర్వాత.. వైద్య పరీక్షల్ని నిర్వహించారు. అనంతరం ఆమెకు సాధారణ వస్త్రాల్ని అందించారు. అయితే.. తనకు ప్రత్యేకవస్త్రాలు ఇవ్వాలని.. వస్త్రాల విషయంలో ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని చెప్పారు. సాధారణ ఖైదీలా ఉండాలని జడ్జి చెప్పిన తర్వాత కూడా ప్రత్యేక వస్త్రాలు ఇచ్చేది లేదని చెప్పటంతో ఆమె.. తనకు కేటాయించిన వస్త్రాల్ని తీసుకోక తప్పలేదు.
ఆదివారం నుంచి పని చేయాల్సి ఉంటుందని జైలు అధికారులు ఆమెకు స్పష్టం చేశారు. ఆమెకు 10711 నెంబరును కేటాయించిన జైలు అధికారులు.. ఆమెకు రోజు కూలీ రూ.50గా నిర్ణయించారు. ఆమె ఎంపిక చేసుకోవాల్సిన పనుల జాబితాను ఇవ్వగా.. చివరకు జైలు అధికారులు అగరబత్తీలు.. కొవ్వొత్తులు తయారీ చేసే పనిని అప్పగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పని చేయాల్సి ఉంటుంది. ఉదయం అల్పాహారం.. ఉదయం 11 గంటలకు భోజనం.. మధ్యాహ్నం అల్పాహారం.. సాయంత్రం భోజనం అందించనున్నారు. సాధారణ ఖైదీలకు ఎలాంటి ఆహారాన్ని అందిస్తారో.. అలాంటి ఆహారాన్నే శశికళకు అందించనున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/