Begin typing your search above and press return to search.
శశికళ అసలు గుట్టు బయటపడిందా..!
By: Tupaki Desk | 10 Oct 2016 6:15 AM GMTఇల్లు తగలబడిందని ఒకళ్లు ఏడుస్తుంటే.. చుట్టకి నిప్పు దొరికిందని ఇంకొకరు హ్యాపీగా ఫీలైనట్టుంది ప్రస్తుతం తమిళనాడు పరిస్థితి! రాష్ట్ర సీఎం జయలలిత అనారోగ్యంతో దాదాపు 20 రోజులకు పైగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆమె ఎప్పుడు డిశ్చార్జ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో రాష్ట్రంలో పాలన ఒకింత కుంటుపడింది. అదేవిధంగా అన్నాడీఎంకేలో రాజకీయ ప్రతిష్టంభన కూడా కొనసాగుతోంది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న జయ నెచ్చెలి శశికళ వీటిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు రెడీ అవుతున్నట్టు తమిళనాట ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పుడు ఇదే విషయంపై తమిళ ప్రజలు జోరుగా చర్చించుకుంటుండగా... తమిళనాట సోషల్ మీడియాలో సైతం ఇదే పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. జయ, శశికళల స్నేహం ఇప్పటి కాదు. దాదాపు 30 ఏళ్లకు పైగా ఇద్దరి మధ్యా స్నేహం కొనసాగుతోంది.
అయితే, జయ ఎప్పుడూ పొలిటికల్ విషయాల్లో ప్రత్యక్షంగా శశికళ జోక్యాన్ని తీసుకోలేదు. అయితే, పరోక్షంలో మాత్రం అన్నీ శశే చేస్తున్నారని అంటారు అన్నాడీఎంకే నేతలు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో శశికళ చక్రం తిప్పుతారని పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. అయితే, 1996లో కలర్ టీవీ కుంభకోణం కేసులో జయతో కలసి అరెస్టయి దాదాపు 30 రోజలు జైల్లోనే ఉంది శశి. అయినప్పటికీ.. ఏనాడూ శశి ప్రత్యక్షంగా పొలిటికల్ వింగ్‌లోకి రాలేదు. అయితే, శశి భర్త నటరాజన్ మాత్రం అన్నాడీఎంకేలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే శశికళ కుటుంబం సమాంతర ప్రభుత్వం నడిపిస్తున్నారని ఉప్పందడంతో 2011లో జయ మొత్తంగా వీరి కుటుంబంపై బహిష్కరణ వేటు వేశారు.
ఆ తర్వాత మళ్లీ 2012లో తిరిగి శశిని పార్టీలోకి తీసుకున్నారు. ఇక, అప్పటి నుంచి జయకు అండగా ఉంటున్న శశి తెరవెనుక పాలిటిక్స్‌కే పరిమితం అయిపోయారు. ఇక, ఇప్పుడు అమ్మ ఆస్పత్రి పాలు కావడంతో తన మనసులో ఉన్న రాజకీయ కాంక్షను శశి బయట పెట్టుకునేందుకు యత్నిస్తున్నారన్న టాక్ బయటకు వినిపిస్తోంది. ఇదే అదనుగా శశి ఏకంగా అమ్మ పోస్టు సీఎం పదవిపైనే శశి కన్నేశారని తెలుస్తోంది. దీనికిగాను పలు ఎమ్మెల్యే స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో శశి బరిలోకి దిగవచ్చని, తద్వారా అన్నాడీఎంకేలో కీలకంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. సామాజికంగా బలమైన దేవర్ కులానికి చెందిన శశికి ఆ వర్గం నుంచి మంచి మద్దతు ఉంది.
కరూరు జిల్లాలోని అరవకురిచ్చి, తంజావూరు నియోజకవర్గాలతోపాటు అన్నాడీఎంకే ఎమ్మెల్యే శీనివేల్ మృతి చెందడంతో ఖాళీ అయిన మధురై జిల్లాలోని తిరుపరగుడ్రం నియోజకవర్గంలో త్వరలోనే జరగనున్న ఉప ఎన్నికలలో శశి పోటీ చేయొచ్చని తెలుస్తోంది. అయితే, గతంలో తనకు సమాంతరంగా నిర్ణయాలు తీసుకోవడం, దాదాపు ప్రభుత్వాన్నే నడిపారన్న కారణంగానే జయ.. శశి కుటుంబం మొత్తాన్ని బహిష్కరించిన నేపథ్యంలో ఇప్పుడు శశి ఇప్పుడు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదే ఆసక్తిగా మారింది. ప్రస్తుతం మాత్రం జయ మంత్రి వర్గంలో శశికి మంచి గుర్తింపు, ఆమె మాట పట్ల గౌరవం ఉన్నాయి. కాబట్టే శశి ఈ సాహసానికి పూనుకునే ఆలోచనలో ఉన్నదేమో అని అంటున్నారు విశ్లేషకులు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/