Begin typing your search above and press return to search.
చిన్నమ్మ అండ్ కోకు ‘మోడీ’ మార్క్ షాక్
By: Tupaki Desk | 27 Dec 2016 5:48 PM GMTకొన్ని పరిణామాలు చిన్నవిగా అనిపిస్తాయి కానీ.. అవిచ్చే సంకేతాలు.. సందేశాలు చాలా స్పష్టంగా ఉంటాయి. తాజాగా అలాంటి పరిణామమే తమిళనాడులో చోటు చేసుకుంది. ఎవరి స్థాయి ఎంతన్న విషయాన్ని తేల్చేయటమే కాదు.. ఓవరాక్షన్ చేస్తే ఊరుకునేది లేదన్నట్లుగా తేల్చటమే కాదు.. అందరికి అర్థమయ్యేలా తెలియజేసిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అనారోగ్యంతో ఆసుపత్రిలో మరణించిన అమ్మను రీప్లేస్ చేసేలా చిన్నమ్మ చేస్తున్న పనులపై తమకున్న అసంతృప్తిని చెప్పేశారు మోడీ అండ్ కో. శశికళ దర్పం తగ్గేలా.. ఆమెకు అనవసరమైన గౌరవాన్ని ఆపాదిస్తే.. దెబ్బ పడటం ఖాయమన్న సందేశాన్ని తమ చర్య ద్వారా కేంద్రం చెప్పకనే చెప్పిందన్న మాట వినిపిస్తోంది. సీఎం సీట్లో కూర్చోబెట్టిన విధేయుడు పన్నీరు సెల్వానికి ప్రశాంతత లేకుండా చేసిన చిన్నమ్మకు తాజాగా పరిణామం కరెంటు షాక్ లాంటిదని చెబుతున్నారు.
ఇంతకీ ఏం జరిగిందన్న విషయాన్ని చూస్తే.. అమ్మ మరణం తర్వాత.. ఆమె విధేయులైన ఉన్నతస్థానాల్లో ఉన్న అధికారులు.. వీసీలు.. పలువురు ప్రముఖులు కలుస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ మధ్యన తమిళనాడులోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన వీసీలు చిన్నమ్మ దర్శనం చేసుకొని తెగ సంతోషపడిపోయిన వైనం తెలిసిందే. అయితే.. ఈ కలయికపై నేత స్టాలిన్ అసంతృప్తి వ్యక్తం చేయటమే కాదు.. తమిళనాడు ఇన్ చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుకు కంప్లైంట్ చేశారు.
మామూలుగా అయితే.. ఇలాంటి వాటిపై వచ్చే ఫిర్యాదుల్ని లైట్ తీసుకోవటం గవర్నర్లకు అలవాటే. కానీ.. తాజాగా ఎపిసోడ్ లో మాత్రం విద్యాసాగర్ రావు రియాక్ట్ కావటమే కాదు.. చిన్నమ్మ దర్శనం చేసుకున్న వీసీలందరికి వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇవ్వటం హాట్ టాపిక్ గా మారింది. గవర్నర్ జారీ చేసిన తాజా నోటీసులతో చిన్నమ్మ రాజ్యాంగేతర శక్తిగా అవతరిస్తానంటే ఊరుకునేది లేనట్లుగా గవర్నర్ నోటీసులు ఉందన్న వాదన వినిపిస్తోంది. అమ్మలానే చిన్నమ్మలా పవర్ బ్యాంక్ లా తయారవుతుంటే మోడీ లాంటోళ్లు చూస్తూ కామ్ గా ఊరుకుంటారా..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/