Begin typing your search above and press return to search.
చిన్నమ్మకు ఊరట..5 రోజుల పెరోల్
By: Tupaki Desk | 6 Oct 2017 7:13 AM GMTదివంగత తమిళనాడు సీఎం జయలలిత నెచ్చెలి - అన్నాడీఎంకే బహిష్కృత ప్రధాన కార్యదర్శి శశికళకు ఎట్టకేలకు ఊరట లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తను చూసేందుకు ఆమెకు 5 రోజుల పెరోల్ ను కర్నాటక ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో అక్రమాస్తుల కేసులో శిక్ష పడి కర్నాటకలోని పరప్పన అగ్రహారం జైలులో ఉన్న శశికళ అనుమతి పత్రాలు అందితే...ఈ రోజు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. స్వాగతం పలికేందుకు శశికళ అక్కకుమారుడు దినకరన్ ఇప్పటికే బెంగళూరు చేరుకోవడం గమనార్హం.
అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో విషమించిన భర్తను చూసేందుకు 5రోజులు పెరోల్ కావాలని శశికళ రెండు రోజుల కింద జైలు అధికారులను కోరారు. అయితే సరైన పత్రాలు లేవని జైళ్ల శాఖ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోమారు ఆమె పత్రాలు సమర్పించారు. వాటిని పరిశీలించి 5 రోజుల పాటు ఆమెకు పెరోల్ ను మంజూరు చేయడానికి కర్నాటక సర్కార్ అనుమతి ఇచ్చింది. దీంతో ఆమెకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో దినకరన్ వర్గీయులు బెంగళూరుకు చేరుకుంటున్నారు.
మరోవైపు శశికళ భర్త నటరాజన్ ఆరోగ్యం విషమించిన ఉదంతంలో కీలక పరిణామం జరిగిన సంగతి తెలిసిందే. దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో బాధపడుతున్న 74 ఏళ్ల నటరాజన్‌కు సుమారు ఏడున్నర గంటలపాటు గ్లెనీగిల్స్ గ్లోబల్ హెల్త్ సిటీలో వైద్యులు లివర్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. రెండు అవయవాల మార్పిడి ఆపరేషన్ ను వైద్యులు విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ డిసీజెస్ అండ్ ట్రాన్స్ ప్లాంటేషన్ డైరెక్టర్ డాక్టర్ కె ఇల్లన్ కుమరన్ చెప్పారు. బ్రెయిన్ డెడ్‌కు గురైన 19 సంవత్సరాల కార్తీక్ అనే రోజు కూలీనుంచి వైద్యులు కాలేయం - కిడ్నీ సేకరించి నటరాజన్ కు అమర్చారు. ఈ చికిత్స సమయంలో అందుబాటులో ఉండాలని భావించినప్పటికీ...అప్పుడు పెరోల్ మంజూరు కాలేదు. తాజాగా ఆ అనుమతి దక్కింది.