Begin typing your search above and press return to search.
జైలుకెళ్లే ముందు శశి ఏం చేసిందంటే..
By: Tupaki Desk | 15 Feb 2017 10:05 AM GMTమొండిపట్టుదలలో అమ్మను తలపిస్తున్న చిన్నమ్మ శశికళ తాను జైలుకెళ్లేముందు అమ్మ సమాధిని, అమ్మ నమ్మిన ఎమ్జీఆర్ చిత్రపటాన్ని దర్శించుకున్నారు. శశికళ వెంటనే లొంగిపోవాల్సిందేనని ఈ రోజు సుప్రీంకోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేయడంతో ఇక చేసేదేమీలేక చిన్నమ్మ బెంగళూరుకు బయలుదేరిన విషయం తెలిసిందే. మొదట చెన్నై మెరీనా బీచ్ సమీపంలో ఉన్న అమ్మ జయలలిత సమాధిని దర్శించుకున్నఆమె ఆ తరువాత అక్కడి నుంచి చెన్నైలోని టీనగర్‌లో ఉన్న ఎంజీఆర్ మెమోరియల్ హౌస్ కు వెళ్లారు.
తొలుత అమ్మ సమాధిని దర్శించుకుని అక్కడ మూడు శపథాలు చేసిన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే అవన్నీ శపథాలు కావని శశి అనుచరులు చెబుతున్నారు. ‘‘ఎక్కడున్నా తన మనసు అమ్మ చుట్టూనే ఉంటుందని, దానిలో మార్పుండద’’ని చెబుతూ ఆమె తొలిసారి సమాధిపై కొట్టారని అన్నా డీఎంకే నేతలు చెబుతున్నారు. ఆ తరువాత రెండూ మాత్రం శపథాలు వంటివేనని.. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఆశయాలను కొనసాగిస్తానని ఓ సారి, పార్టీని చీల్చాలని చూసేవారిని ఎన్నటికీ క్షమించనని ఇంకోటి శపథాలు చేశారని చెబుతున్నారు. ఆ సమయంలో శశికళ కళ్లు ఎరుపెక్కి అత్యంత ఆగ్రహంగా ఉన్నాయని అక్కడున్న నేతలు చెబుతున్నారు.
జయ సమాధిని దర్శించుకున్న తరువాత అక్కడ ఎంజీఆర్ చిత్రపటానికి ఆమె నివాళులు అర్పించి, అక్కడే కాసేపు కూర్చున్నారు. ఎంజీఆర్ మెమోరియల్ హౌస్ లో ఆమె ఎమ్జీఆర్ సాక్షిగానూ పలు శపథాలు చేశారని చెబుతున్నారు. అక్కడి నుంచి ఆమె ప్రత్యేక న్యాయస్థానానికి వెళ్లేందుకు బయలుదేరారు.
కాగా... శశికళ తనను సాధారణ ఖైదీగా కాకుండా, ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని తాజాగా పిటిషన్ వేశారు. జైల్లో తనకు ప్రత్యేక వసతులు కల్పించాలని కోరారు. జైల్లో ప్రత్యేక సెల్ ను కేటాయించాలని, మంచం, పరుపు, మినరల్ వాటర్, ఇంటి భోజనం, టీవీ సదుపాయాన్ని కేటాయించాలని కోరారు. వీటికి తోడు వ్యక్తిగత సహాయకురాలిని కేటాయించాలని కోరారు.
మరోవైపు బెంగళూరులోని పరప్పణ అగ్రహారం కేంద్ర కారాగారం సమీపంలో 144 సెక్షన్ విధించారు. జైలు ప్రాంగణంలోని కోర్టు హాలులో శశికళ లొంగిపోనున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు హాలును సిద్ధం చేస్తున్నారు. మద్యాహ్నం 3 గంటలకు జడ్జి అశ్వర్థనారాయణ కోర్టుకు రానున్నారు.
ఇదిలాఉండగా అన్నాడీఎంకే నాయకురాలు శశికళపై అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే శరవణన్ కూవత్తూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను గోల్డెన్ బే రిసార్ట్‌లో అక్రమంగా నిర్బంధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు 100 మందికి పైగా ఎమ్మెల్యేలను ఆరు రోజుల పాటు రిసార్ట్‌లో శశికళ నిర్బంధించిన విషయం విదితమే. ఇక అన్నాడీఎంకే కార్యనిర్వహక కార్యదర్శి పదవికి పాండ్యన్ రాజీనామా చేశారు. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్‌ను నియమించడంపై పాండ్యన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/