Begin typing your search above and press return to search.
పన్నీర్ కి దిమ్మ తిరిగేలా చిన్నమ్మ ప్లాన్?
By: Tupaki Desk | 8 Feb 2017 1:36 PM GMTచేతిలో ఎమ్మెల్యేలందరూ (నలుగురు మినహాయించి) ఉన్నారు. వారి సంపూర్ణ మద్దతు ఆమెకేనని ప్రకటిస్తున్నారు. అయినప్పటికీ.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు పరిస్థితులు అనుకూలించకపోవటం చిన్నమ్మ శశికళకు చిరాకు తెప్పించేస్తోంది. అనుమానించినట్లే.. ఒకప్పటి వీర విధేయుడు పన్నీర్ చెలరేగిపోతున్నవేళ.. తన అధిక్యతను ఫ్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయాన్ని వేదికగా చేసుకొని మీడియా సమక్షంలో తనకున్న ఎమ్మెల్యేల బలాన్ని ప్రదర్శించిన చిన్నమ్మ.. సాంకేతికంగా తాను సీఎం కావటానికి ఎలాంటి అడ్డంకులు ఉండకూదన్న భావన కలిగేలా చేయటంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి.
అదే సమయంలో తిరుగుబాటు బావుటాను ఎగురువేసిన పన్నీర్ బలం ఏమిటన్నది చెప్పకనే చెప్పేశారు. ముందస్తు జాగ్రత్తగా తన గూటికి వచ్చిన ఎమ్మెల్యేల్ని.. భద్రంగా బస్సుక్కించిన అమ్మ రహస్య ప్రాంతంలో ఉండే హోటల్ కు తరలించినట్లుగా చెబుతున్నారు. పరిస్థితులు తన కంట్రోల్ లోకి వచ్చే వరకూ.. తన కనుసన్నల్లో ఉంచుకునేందుకు వీలుగా చిన్నమ్మ ఎమ్మెల్యేల్ని సీక్రెట్ ప్లేస్ కు తరలించినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆమె వేసిన ఒక ఎత్తును చూస్తే.. ఆమెప్రత్యర్థి పన్నీర్ కు దిమ్మ తిరిగిపోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
ఓపక్క పన్నీర్ ఈ రోజు చెన్నై నుంచి ముంబయి వెళ్లి.. గవర్నర్ ను కలిసి.. తాజా రాజకీయ పరిస్థితుల్ని వివరించి.. తానుచేసిన రాజీనామా లేఖను ఉపసంహరించుకోవాలని అడగనున్నట్లుగా చెబుతున్నారు. పన్నీర్ ఎత్తుకు పైఎత్తు వేసిన చిన్నమ్మ.. తన దగ్గరున్న 130మంది ఎమ్మెల్యేల్ని తీసుకొని చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్లి.. రాష్ట్రపతి ముందు పరేడ్ పెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. తనకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు వీల్లేకుండా గవర్నర్ తమకు సహకారం అందించటం లేదన్న ఫిర్యాదును దేశ ప్రధమ పౌరుడి దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ అదేజరిగితే.. చిన్నమ్మ ప్లాన్ కు పన్నీర్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/