Begin typing your search above and press return to search.
చిన్నమ్మపై ఒంటి కాలిపై లేచిన శశికళ
By: Tupaki Desk | 16 Dec 2016 8:14 AM GMTఇద్దరి పేర్లు ఒక్కటే. కానీ.. ఇద్దరి మధ్య అంతరం బోలెడంత. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరో కాదు.. ఒకరు అమ్మకు నెచ్చెలిగా వ్యవహరించిన శశికళ నటరాజ్ అయితే.. మరొకరు అమ్మ అనుగ్రహాన్ని.. ఆగ్రహాన్ని చవి చూసిన రాజ్యసభసభ్యురాలు శశికళ పుష్ప. అమ్మ బతికున్నప్పుడే.. ఆమె మీదనే ఫైటింగ్ చేయటానికి వెనుకాడని ఈ మాజీ అన్నాడీఎంకే ఫైర్ బ్రాండ్.. తాజాగా చిన్నమ్మ శశికళపై ఒంటికాలిపై లేచారు. తాజాగా ఆమెఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సంచలనంగా మారటమే కాదు.. పలు షాకింగ్ అంశాల్ని ఆమె ప్రస్తావించారు.
అమ్మ తర్వాత అన్నాడీఎంకే రథసారధి అయ్యేందుకు పావులు కదుపుతున్న శశికళకు షాకిచ్చేలా వ్యాఖ్యలు చేయటమే కాదు.. ఆమె సంధించిన ప్రశ్నల్లో నిజమే కదా? అన్న భావన కలిగేలా చేయటం ఇప్పుడుఆసక్తికరంగా మారింది. పార్టీ నుంచి బహిష్కరణ వేటు వేయించుకున్న శశికళ ఫుష్ప తాజాగా మాట్లాడుతూ.. శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎంపిక చేయటం సరికాదని.. అధినేత్రి జయలలిత ఎప్పుడూ ఆమె పేరును సూచించలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.
‘‘ఆమెకు కనీసం కౌన్సిలర్ పదవి కూడా ఇవ్వలేదు. ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు. శశికళ రాజకీయాలకు పనికి రారు. జయ మృతికి గతంలో కుట్ర పన్నినందుకే ఆమెను జయలలిత బహిష్కరించారు. జయలలిత మృతి మీద అనుమానాలు ఉన్నాయి. దీనిపై న్యాయవిచారణ జరిపించాలి. పార్టీలో కూడా పలువురికి ఇలాంటి అనుమానాలే ఉన్నాయి’’ అంటూ ఆరోపణలు చేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నియామకాన్ని ప్రజాస్వామ్య బద్ధంగా నియామకం జరిపించాలంటూ తాను మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసినట్లుగా శశికళపుష్ప వెల్లడించారు. అమ్మతోనే ఢీ అన్న ఈ శశికళ.. చిన్నమ్మపై రానున్న రోజుల్లో తన మాటలతో మరెన్ని షాకులిస్తారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/