Begin typing your search above and press return to search.
'శశికళ' రీ ఎంట్రీ ... వేడెక్కిపోతోన్న తమిళ పాలిటిక్స్ !
By: Tupaki Desk | 1 Jun 2021 7:30 AM GMTశశికళ .. అలియాస్ చిన్నమ్మ ..రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా మరోసారి వేడెక్కుతున్నాయి. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ అధికారాన్ని కోల్పోయిన నేపథ్యంలో, తాను మళ్లీ పార్టీ పగ్గాలు చేపడతానంటూ శశికళ వ్యాఖ్యలు చేసినట్టుగా ఇటీవల వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. పార్టీ భ్రష్టు పట్టిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేనని, తానొచ్చి మళ్లీ పార్టీని గాడిన పెడతానని తన మద్దుతుదారులకు శశికళ భరోసా ఇచ్చినట్టు ఆ వార్తల ప్రధానమైన సారాంశం. అన్నాడీఎంకే కార్యకర్తలతో శశికళ ఫోన్‌లో మాట్లాడి.. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పారనే వార్తలు ఇప్పుడు తమిళనాట హల్‌చల్ చేస్తున్నాయి.
ఈ వార్తలపై అన్నాడీఎంకే డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుసామి స్పందించారు. శశికళను ఎట్టిపరిస్థితుల్లోనూ మళ్లీ పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేవలం పార్టీపై పట్టుకోసం కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు. అన్నాడీఎంకే కార్యకర్తలకు, శశికళకు ఎలాంటి సంబంధం లేదన్న మునుసామి, మళ్లీ పార్టీలోకి వచ్చేందుకు శశికళ ఆడుతున్న డ్రామాగా దీనిని అభివర్ణించారు. తమ పార్టీలో ఎవరూ శశికళతో మాట్లాడలేదన్న ఆయన, పార్టీని నిర్మించినది శశికళ లాంటి వారు కాదని, ఎంజీ రామచంద్రన్ పార్టీని స్థాపించినప్పటి నుంచి కార్యకర్తలే పార్టీకి వెలకట్టలేని సేవలు చేశారని ఆయనఅన్నారు. పళనిస్వామి ,పన్నీర్ సెల్వం మధ్య విభేదాలున్నట్టు జరుగుతున్న ప్రచారం కూడా శశికళ కుట్రే అని అన్నారు. ఇక ఇదిలా ఉంటే మాజీ సీఎం , నటి జయలలిత మృతి చెందిన తర్వాత , అన్నాడీఎంకే అధ్యక్షురాలిగా వ్యవహరించిన శశికళ, ఆనతి కాలంలోనే అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లాక అధ్యక్ష స్థానాన్ని కోల్పోయింది. ఆ తర్వాత ఊహించని పరిణామాలు ఎన్నో జరిగాయి. ఆ తర్వాత రాజకీయాలు వీడి ఆధ్యాత్మిక మార్గాన్ని పాటిస్తున్నట్టు శశికళ చెప్పింది. కానీ, ఈలోపే మళ్లీ రీఎంట్రీ పై వార్తలు వస్తుండటం తో మళ్లీ చిన్నమ్మ తమిళనాడు లో చక్రం తిప్పడానికి వ్యూహాలు వేస్తున్నారా అంటూ చర్చ జరుగుతోంది.