Begin typing your search above and press return to search.

చిన్నమ్మ అరెస్ట్ అయితే..రిసార్ట్స్ బిల్లు కట్టేదెవరు?

By:  Tupaki Desk   |   14 Feb 2017 8:46 AM GMT
చిన్నమ్మ అరెస్ట్ అయితే..రిసార్ట్స్ బిల్లు కట్టేదెవరు?
X
ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే అన్న సామెత లెక్కన ఉందీ యవ్వారం. అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు నుంచి ఊహించని తీర్పుతో శశికళ వర్గం పూర్తిగా నిరాశ.. నిస్పృహల్లో కూరుకుపోవటమే కాదు.. మరి కొద్ది గంటల్లో జైలుకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాను ముఖ్యమంత్రిని కావటం కోసం ఎనిమిది రోజులుగా క్యాంప్ నిర్వహిస్తున్న శశికళ.. ఇప్పుడు అరెస్ట్ అయి జైలుకు వెళితే.. రిసార్ట్స్ బిల్లు కట్టే బాధ్యత ఎవరి మీద పడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

రిసార్ట్స్ బిల్లు అని సింఫుల్ గా అనుకోవటానికి లేదు. దాదాపు కోటి రూపాయిలకు పైనే..బిల్లు అయినట్లుగా తెలుస్తోంది. అవి కాకుండా మిగిలిన ఖర్చులు కూడా భారీగా అయినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ఈ పేమెంట్ మొత్తం కోట్లల్లో ఉంటుందన్న మాట వినిపిస్తోంది. తీర్పు వెలువడిన కొద్ది గంటలకే జైలుకు వెళ్లాల్సి నేపథ్యంలో.. రిసార్ట్స్ కు అయిన ఖర్చు బాధ్యత ఎవరు తీసుకుంటారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ముందుగా అడ్వాన్స్ ఇవ్వకుండానే.. పలుకుబడి మీద అద్దెకు తీసుకున్నారని.. గడిచిన ఎనిమిది రోజులుగా ఎలాంటి పేమెంట్ ఇవ్వలేదన్న మాట వినిపిస్తోంది.

ఇష్యూ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత పేమెంట్ వస్తుందని భావించినా..ఇప్పుడు అసలు వ్యక్తి అయిన చిన్నమ్మ జైలుకు వెళుతున్న వేళ.. బిల్లు సంగతేమిటి? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/