Begin typing your search above and press return to search.

జ‌య మృతి మిస్ట‌రీపై శ‌శిక‌ళ వెర్ష‌న్ ఇదీ..

By:  Tupaki Desk   |   9 Feb 2017 4:04 AM GMT
జ‌య మృతి మిస్ట‌రీపై శ‌శిక‌ళ వెర్ష‌న్ ఇదీ..
X
ఎట్ట‌కేల‌కు శ‌శిక‌ళ నోరు విప్పింది. ప‌న్నీర్ సెల్వం తిరుగుబాటు నేప‌థ్యంలో ఆమె అనేక అంశాల‌పై మాట్లాడింది. ప‌న్నీర్ న‌మ్మ‌క ద్రోహం చేశాడ‌ని.. అత‌నో అస‌మ‌ర్థుడ‌ని విమ‌ర్శలు గుప్పించిన శ‌శిక‌ళ‌.. జ‌యల‌లిత‌ మృతికి సంబంధించి త‌న మీద గుప్పించిన ఆరోప‌ణ‌ల‌కు కూడా స‌మాధానం ఇచ్చింది. జ‌య‌ల‌లిత‌ను తాను 33 ఏళ్లుగా కంటికి రెప్ప‌లా కాపాడుకుంటున్నాన‌ని.. ఆమె అనారోగ్యం పాలైన‌పుడు కూడా అంతే శ్ర‌ద్ధ‌తో ఉన్నాన‌ని శ‌శిక‌ళ తెలిపింది.

‘‘అమ్మతో కలిసి నేను 33 ఏళ్లు ఒకే ఇంట్లో నివసించాను. ఆమెను నేను ఎంత బాగా చూసుకున్నానో బాడీగార్డులకు తెలుసు. ఆమె మృతికి సంబంధించి కావాల‌నే వదంతులు సృష్టిస్తున్నారు. అమ్మ ఆస్పత్రిలో ఉన్న 75 రోజులూ నేను ఆమెతోనే ఉన్నాను. ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాను. ఇందుకు డాక్ట‌ర్లే సాక్షి. నా అంతరాత్మ సాక్షిగా చెబుతున్నా.. అమ్మ మృతి తర్వాత నేను తీవ్ర మ‌నోవేద‌నకు గుర‌య్యాను’’ అని శ‌శిక‌ళ చెప్పింది.

జయలలిత మృతిపై అనుమానాలు నివృత్తి చేసేందుకు విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఆపద్ధర్మ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతున్న పన్నీర్‌ సెల్వం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. జ‌య మృతి విష‌యంలో ఎలాంటి మిస్ట‌రీ లేద‌ని.. ఎలాంటి విచార‌ణకైనా సిద్ధ‌మ‌ని శ‌శిక‌ళ ప్ర‌క‌టించింది. ప‌న్నీర్ ప్ర‌క‌ట‌న త‌న‌ను తీవ్రంగా బాధించింద‌ని.. జ‌య‌ను కాపాడ‌టానికి ఎయిమ్స్‌.. లండన్‌.. సింగపూర్‌.. ఇలా చాలా చోట్ల నుంచి వైద్యుల్ని పిలిపించిన‌ట్లు ఆమె తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/