Begin typing your search above and press return to search.
`అమ్మ` గురించి దినకరన్ బాంబు పేల్చాడే!
By: Tupaki Desk | 26 Sep 2017 10:19 AM GMTతమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత మృతిపై అనేక సందేహాలున్నాయని తమిళనాడు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా పళని స్వామి ప్రభుత్వం జయ మృతి వెనుక ఏమైనా రహస్యాలు ఉన్నాయేమోనని పరిశోధించేందుకు మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగ స్వామితో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇంత వరకు బాగానే ఉంది. దీనిని అందరూ స్వాగతించారు. అమ్మ గురించిన విషయాలు వెల్లడవుతాయని ఆనందించారు.
అయితే, ఇప్పుడు ఇదే సమయంలో అన్నాడీఎంకే వెలివేత ప్రధాన కార్యదర్శి, శశికళ బంధువు టీటీవీ దినకరన్ చేసిన ప్రకటన ఆసక్తి రేకెత్తించింది. నిన్న మొన్నటి వరకు జయ ఆస్పత్రి విషయాలపై సైలెంట్‌గా ఉన్న ఆయన... ఏకసభ్య కమిషన్ వేయగానే మీడియా ముందుకు వచ్చారు. అమ్మ ఆస్పత్రిలో ఉండగా ప్రతి నిముషాన్నీ తాను వీడియో తీయించామని చెప్పుకొచ్చారు. అమ్మకు అందిన వైద్యం సహా అమ్మ ఏం తిన్నారు? ఎలాంటి ఆహారం తీసుకున్నారు? ఎలాంటి ట్రీట్‌మెంట్ తీసుకున్నారు? వంటి సమస్త విషయాలనూ తాము రికార్డు చేశామని బాంబు పేల్చారు.
అయితే, ఆ వీడియోలు ఎందుకు బహిర్గతం చేయలేదు? అని మీడియా ప్రశ్నిస్తే.. అప్పట్లో అమ్మ నైటీపైనే ఉన్నారని, అందుకే అమ్మను అలా చూపించలేకే బహిర్గతం చేయలేదని చెప్పారు. మొత్తానికి ఈ వీడియో అయితే ఏకసభ్య కమిషన్‌కు ఇస్తానని చెప్పుకొచ్చారు. తాజాగా దినకరన్ ప్రకటనతో తమిళనాడు ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇప్పటి వరకు అమ్మకు ఏమైందో ? అని చాలా మంది అల్లాడిపోయారు. అలాంటి తరుణంలో అమ్మ గురించి అంతా రికార్డెడ్‌గా ఉందని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఏకసభ్య కమిషన్ తన పనిని ప్రారంభించనుంది. ఈ క్రమంలో జయ నెచ్చెలి.. ప్రస్తుతం జైల్లో ఉన్న శశికళతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి ఎలాంటి నివేదిక వస్తుందో చూడాలి.