Begin typing your search above and press return to search.

జల్లికట్టు సీన్లోకి వచ్చేసిన చిన్నమ్మ

By:  Tupaki Desk   |   19 Jan 2017 5:18 AM GMT
జల్లికట్టు సీన్లోకి వచ్చేసిన చిన్నమ్మ
X
యావత్ తమిళనాడు మొత్తం జల్లికట్టు నిషేధం మీద తీవ్ర భావోద్వేగంతో ఊగిపోతున్న వేళ.. చిన్నమ్మ శశికళ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. జల్లికట్టుపై సుప్రీం.. కేంద్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఆందోళనలు చేస్తున్న వేళ.. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఆందోళనలు చేస్తున్న తమిళుల్ని శాంతించాల్సిందిగా.. నిరసనల్ని విరమించాల్సిందిగా కోరితే.. చిన్నమ్మ మాత్రం అందుకు భిన్నంగా రియాక్ట్ అయ్యారు.

ముఖ్యమంత్రి తీరుకు కాస్తంత భిన్నంగా వ్యవహరించిన చిన్నమ్మ.. తమిళుల డిమాండ్లకు సానుకూలంగా స్పందించటమే కాదు.. ఈ ఎపిసోడ్ లో తనదైన కార్యాచరణను ప్రదర్శించటం ద్వారా.. తనను తక్కువగా అంచనా వేయటానికి వీల్లేదన్న సందేశాన్ని పంపినట్లుగా చెప్పాలి. ప్రజలు కోరుతున్నట్లుగా జల్లికట్టు మీద నిషేధాన్ని తీసి వేయాలని.. ఈ విషయం మీద కేంద్రం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేయటమే కాదు.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ను నిలువరించాలని కోరారు.

అంతేకాదు.. జల్లికట్లుకు వ్యతిరేకంగా సుప్రీంను ఆశ్రయిస్తామని.. ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన పెటాను తమిళనాడులో నిషేధిస్తామన్న సాంత్వన మాటను చిన్నమ్మ చెప్పటం గమనార్హం. ఇందుకు సంబంధించిన న్యాయ ప్రక్రియను ప్రారంభించినట్లు చెప్పటం ద్వారా తమిళుల మనోభావాలకు తానెంతగా ప్రాధాన్యత ఇస్తానన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. అంతేకాదు.. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతో ఈ విషయంపై మాట్లాడటమే కాదు.. జల్లికట్టుపై సుప్రీం విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ అసెంబ్లీ ప్రత్యేకసమావేశాల్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాల్ని నిర్వహించేందుకు డేట్ ను ఒకట్రెండు రోజుల్లో డిసైడ్ చేయాలని నిర్ణయించారు. తమిళులంతా ఒక్కటై..జల్లికట్టుపై తన వాదనను వినిపిస్తున్న వేళ.. చిన్నమ్మ ఊరుకుండిపోకుండా.. వారి ఆందోళనలకు తాను నేతృత్వం వహిస్తున్నట్లుగా సంకేతాలు పంపటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/