Begin typing your search above and press return to search.

చిన్నమ్మ ప్రమాణానికి టైం ఫిక్స్

By:  Tupaki Desk   |   6 Feb 2017 4:32 PM GMT
చిన్నమ్మ ప్రమాణానికి టైం ఫిక్స్
X
సీఎం కుర్చీలో కూర్చోవటానికి తహతహలాడుతున్నారు అన్నాడీఎంకే అధినేత్రి అలియాస్ చిన్నమ్మ. ఆలస్యం అమృతం విషం అనుకున్నారో.. లేక పాత కేసుల తీర్పుల చిక్కులు వచ్చిమీద పడతాయన్న సందేహమేమో కానీ.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సీఎం కుర్చీలో ఒక్కసారి కూర్చోవాలన్నట్లుగా ఆమె వ్యవహారశైలి ఉందన్న మాట వినిపిస్తోంది.

తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణస్వీకారం తొమ్మిదో తేదీన జరుగుతుందన్న మాటను అన్నాడీఎంకే వర్గాలు వెల్లడించాయి.అయితే..చిన్నమ్మ ప్రమాణస్వీకారానికి అడ్డంకులు ఎదురయ్యేలా పరిణామాలు చోటు చేసుకోనుండటంతో అలాంటి వాటికి చెక్ చెప్పేందుకు వీలుగా.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం రేపు (మంగళవారం) చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చకచకా చేసేస్తున్నారు.

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పెద్దఎత్తున చేపడుతున్నారు. ఓపక్క భర్త అనారోగ్య పరిస్థితుల్లో ఆసుపత్రిలో ఉన్నప్పటికీ.. ఆయనకు సంబంధించిన వివరాలు బయటకు రానివ్వని చిన్నమ్మ అండ్ కో.. మంగళవారం నాడు జరపాల్సిన ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లను ఘనంగా చేయాలన్న ఆదేశాల్ని జారీ చేసినట్లుగా చెబుతున్నారు.

మద్రాస్ యూనివర్సిటీలోని సెంటినరీ ఆడిటోరియంలో చిన్నమ్మ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. చిన్నమ్మ సీఎంగా ప్రమాణస్వీకారం చేసే ముహుర్తం విషయానికి వస్తే మంగళవారం ఉదయం 8.45 గంటలకు ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. మరి.. తన సీఎం పదవిని త్యాగం చేసిన పన్నీరుసెల్వంకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించనున్నట్లు చెబుతున్నారు.

అదే సమయంలో కీలక ఫోర్ట్ ఫోలియోలన్నీ ఆయనకే కట్టబెట్టనున్నట్లు చెబుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు గండం చిన్నమ్మను వెంటాడుతున్న వేళ.. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లుగా సమాచారం. వారం వ్యవధిలో అక్రమాస్తుల కేసుపై తీర్పు వెల్లడిస్తామని సుప్రీం కోర్టు వెల్లడించినప్పటికీ.. హడావుడిగా సీఎం పదవికి ప్రమాణస్వీకారం చేస్తున్న చిన్నమ్మ.. ఆ పదవిలో ఎంత కాలం ఉంటారన్న సందేహన్ని పలువురు వ్యక్తం చేయటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/