Begin typing your search above and press return to search.
అమ్మ స్థానంలో చిన్నమ్మ పోటీ?
By: Tupaki Desk | 9 Dec 2016 8:14 AM GMTఅమ్మ స్థానంలోకి వచ్చేందుకు చిన్నమ్మ అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారు. అన్నా డీఎంకే పగ్గాలు చేపట్టేందుకు జయలలిత నెచ్చెలి శశికళ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పోయెస్ గార్డెన్ ను తన అధికారిక నివాసంగా మార్చుకున్న శశికళ... జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి తమిళనాడు అసెంబ్లీకి వెళ్లాలని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆర్కే నగర్ నుంచి పోటీ చేసి జయలలిత తరువాత తానేననే సందేశాన్ని తమిళనాడు ప్రజల్లోకి, రాజకీయ వర్గాల్లోకి స్పష్టమైన సందేశం పంపాలని గట్టి నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పోయెస్ గార్డెన్ లో పార్టీ ముఖ్యనేతలతో ఆమె సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
మరోవైపు ఇప్పటికే ఆమె అధికార కేంద్రంగా మారిపోయారు. జయ ఆసుపత్రిలో ఉన్నప్పటి నుంచే అంతా తానై శశికళే నడిపిస్తున్నారు. ‘అమ్మ’ అధికారిక నివాసమైన పోయెస్ గార్డెన్‌కు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా మంత్రుల క్యూకడుతున్నారు. జయ స్థానంలో పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న శశికళ కటాక్షం కోసం వేచి చూస్తున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో శశికళ కీలకం కాబోతున్నారన్న వార్తతో ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు.