Begin typing your search above and press return to search.
మీరే కాపాడాలని కన్నీళ్లతో వేడుకున్న శశికళ
By: Tupaki Desk | 8 Oct 2017 8:28 AM GMTఎంతటి వారైనా భావోద్వేగానికి బంధీలే. తన పట్ల కుట్రపూరితంగా వ్యవహరించిన వారి సంగతి తేలుస్తానంటూ తన నెచ్చెలి సమాధి దగ్గర ఆవేశంతో చరిచిన చిన్నమ్మ అలియాస్ శశికళ గుర్తున్నారా? అంతటి ఆవేశం.. ఆగ్రహం ఉన్న ఆమె.. తాజాగా ఆసుపత్రిలో ఉన్న తన భర్తను చూసి విలవిలలాడిపోయారు. తీవ్ర అనారోగ్యంతో ఇటీవల శస్త్రచికిత్సలు చేసిన తన భర్త నటరాజన్ పరిస్థితి చూసి ఆమె కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆమె.. కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే. భర్త నటరాజన్ ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగోలేకపోవటంతో ఆయన్ను చూసుకునేందుకు కోర్టు ఇచ్చిన పెరోల్ తో బయటకు వచ్చారు. చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్తను చూసి కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు.
తాను దగ్గర ఉండి చూసుకోలేని పరిస్థితులు ఉన్నందున తన భర్తను మీరే జాగ్రత్తగా చూసుకోవాలంటూ వైద్యులను శశికళ కోరినట్లుగా చెబుతున్నారు. జైలు నుంచి చెన్నై చేరుకున్నా.. సుదీర్ఘ కాలం తర్వాత భర్తను కలుసుకుంటున్న నేపథ్యంలో మంచి ముహుర్తంలోనే పరామర్శ మంచిదంటూ పండితులు చేసిన సూచనను శశికళ తూచా తప్పకుండా పాటించారు.
శనివారం ఉదయం 10.30 గంటల వరకూ రాహుకాలం ఉండటంతో అది దాటిన తర్వాత 11 గంటల వేళలో కారులో బయలుదేరిన ఆమె.. తన నెచ్చెలి సెంటిమెంట్ ఆలయమైన కొట్టూరుపురంలోని వినాయకుడి గుడి వద్ద కారులో నుంచే దండం పెట్టుకొని గ్లోబల్ ఆసుపత్రికి చేరుకుననారు. ఆమె వెంట బంధువులు ఉన్నా.. ఐసీయూలో ఉన్న భర్త వద్దకు మాత్రం ఆమె ఒక్కరిని మాత్రమే వైద్యులు అనుమతించారు. భర్త ఉన్న పరిస్థితి చూసి తీవ్ర ఉద్వేగానికి గురైనట్లుగా చెబుతున్నారు.
నటరాజన్ కొన్నాళ్లు ప్రమాదకర పరిస్థితుల్లోనే ఉంటారని.. ఆ తర్వాత కొద్దిగా కోలుకుంటారని.. మూడు నెలల విశ్రాంతి తర్వాత ఎప్పటిలానే పని చేసుకునే వీలు ఉందని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పెరోల్ మీద బయటకు వచ్చిన శశికళను కలుసుకోవటానికి ఆమె తరఫు నేతలు ఎవరూ రావటానికి సాహసించలేదు. కేంద్ర.. రాష్ట్ర పోలీసులు.. నిఘా వర్గాలు డేగ కళ్లతో ఉండటంతో.. చిన్నమ్మను కలిసి అడ్డంగా బుక్ అయ్యే కన్నా.. కామ్ గా ఉండటం మంచిదన్న అభిప్రాయంతో ఆమెకు దూరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. నిజానికి తనను కొందరైనా నేతలు కలుసుకుంటారని శశికళ ఆశించారని.. కానీ.. దాని వల్ల లేనిపోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్న భావనతో ఎవరూ ఆమెను కలవలేదని తెలుస్తోంది.