Begin typing your search above and press return to search.
ఇదే నా శపథం.. అంటున్న శశికళ!
By: Tupaki Desk | 30 Dec 2020 1:51 PM GMTఅన్నా డీఎంకే అధినేత్రి జయలలితను కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు జయ చీర కొంగు పట్టుకు లాగారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. దీంతో జయలలిత డీఎంకే ఎమ్మెల్యేలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మళ్ళీ సీఎంగా గెలిచే వరకూ సభలో అడుగు పెట్టనంటూ శపథం చేశారు. అన్నట్టుగానే ఆమె గెలిచాకే అసెంబ్లీలో అడుగు పెట్టారు.
ఇప్పుడు తమిళ జనాలు చిన్నమ్మగా పిలిచే శశికళ కూడా ఓ శపథం చేయనుందని సమాచారం.
ప్రస్తుతం అక్రమ ఆస్తుల కేసులో ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. వచ్చే నెల 27న ఆమె విడుదల కానున్నారు. ఆమెకు జైలు వద్ద భారీగా స్వాగతం పలికేందుకు శశికళ మేనల్లుడు ఏఎంఎంకే నాయకుడు దినకరన్ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. శశికళ జైలు నుంచి విడుదల కాగానే ఆమె నేరుగా చెన్నై మెరీనా బీచ్ లో ఉన్న తన నెచ్చెలి, మాజీ సీఎం జయ లలిత సమాధి వద్దకు వెళుతుందని సమాచారం.
అక్కడ ఆమె జయలలిత సమాధి మీద శపథం చేశాకే ఇంటికి వెళతారని ఏఎంఎంకే కార్యకర్తలు చెబుతున్నారు. అయితే అన్నా డీఎంకే పార్టీని తిరిగి కైవసం చేసుకుంటానని శపథం చేస్తుందా.. లేక తనను జైలుపాలు చేసిన వారి భరతం పడతానని శపథం చేస్తుందా.. అన్న విషయంపై మాత్రం క్లారిటీ రావడం లేదు. చిన్నమ్మ శపథం ఏంటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు.