Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ మెడ‌కు న‌కిలీ కంపెనీల ఉచ్చు

By:  Tupaki Desk   |   13 Feb 2017 5:01 AM GMT
చిన్న‌మ్మ మెడ‌కు న‌కిలీ కంపెనీల ఉచ్చు
X
అన్నాడీఎంకే తాత్కాలిక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ‌శిక‌ళ మ‌రిన్ని చిక్కుల్లో ప‌డ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి శశికళ ఒకవైపు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు ఆమెకు పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. నకిలీ కంపెనీలు, వివాదాస్పద గనుల (మైనింగ్) పారిశ్రామికవేత్తతో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. ఏ వరల్డ్ రాక్ అనే కంపెనీని స్థాపించడానికి ఎస్ వైకుందరాజన్‌తో 2002లో శశికళ మేనల్లుళ్లు వీఎస్ శివకుమార్, కార్తికేయన్ కలియపెరుమాళ్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. వైకుందరాజన్.. వీవీ మినరల్స్ యజమాని. ఈ కంపెనీకి రూ.76,500 కోట్ల విలువైన బీచ్ శ్యాండ్ మైనింగ్ వ్యాపారంలో 75 శాతం వాటా ఉంది.

వీవీ మినరల్స్ మోసపూరిత వ్యాపారం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. 2013 ఆగస్ట్‌లో ఈ కంపెనీపై అప్పటి ట్యుటికోరిన్ జిల్లా కలెక్టర్ ఆశిశ్ కుమార్ దాడులు నిర్వహించారు. ఈ కంపెనీ అక్రమ మైనింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నదని తన నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్ర లిక్కర్ పంపిణీదారుకు సరఫరాదారు అయిన మిడాస్ గోల్డెన్ డిస్టిలరీస్‌లోనూ ఆమెకు వాటా ఉందని తెలుస్తున్నది. ఈ సంస్థలకు ఆమె రాజీనామ చేశారో లేదో తెలియడం లేదు.

ఇదిలాఉండ‌గా, శశికళ కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య తగ్గింది. శనివారం ఆమె రిసార్ట్స్‌కు వెళ్లినప్పుడు కాన్వాయ్‌లో 30 వాహనాలుండగా, ఆదివారం ఐదు వాహనాలు మా త్రమే ఉన్నాయి. శశికళకు మద్దతుగా 127 మంది ఎమ్మెల్యేలున్నారని చెబుతుండగా, ఆరుగురు రిసార్ట్స్‌లో కాకుండా చెన్నైలోనే ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేలకు శిక్షణనిచ్చేందుకు, తమలో నైతి క స్థయిర్యాన్ని పెంచేందుకు వరుసగా రెండోరోజు శశికళ తమను కలుసుకున్నారని రిసార్ట్స్‌లో ఉన్న ఎమ్మె ల్యే ఓఎస్ మణియన్ చెప్పారు. ఆదివారం నుంచి వినూత్నరీతిలో ఆందోళన చేపడుతామని హెచ్చరించిన శశికళ ఆ దిశగా ఏ కార్యక్రమమూ చేపట్టలేదు. ఇదే స‌మ‌యంలో స‌మ‌యంలో శశికళకు తమిళ ప్రజల మద్దతు రోజురోజుకు తగ్గుతున్నట్లు కనిపిస్తున్నది. శశికళ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన రోజున ఆమెను అభినందించేందుకు వేల సంఖ్యలో ప్రజలు అక్కడికి తరలివచ్చారు.ఆదివారం మాత్రం సుమారు 150 మంది మాత్రమే కనిపించారు. వీరిలో కొందరు మాత్రమే పార్టీ రంగులు పూసుకొని, టోపీలు పెట్టుకొని కనిపించారు. చాలామంది విచార వదనాలతో ఉన్నట్టు కనిపించింది.