Begin typing your search above and press return to search.
‘సతాన్’ కాదు.. ప్రపంచానికి అదో సైతాన్
By: Tupaki Desk | 26 Oct 2016 3:51 PM GMTఅత్యాధునిక సాంకేతికతతో ఆయుధాల్ని తయారు చేయటంలో రష్యా సామర్థ్యం గురించి ప్రపంచానికి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. అయితే.. ఈ దేశం తాజాగా రూపొందించాలని ప్రయత్నిస్తున్న అత్యాధునిక అణుక్షిపణి గురించి తెలిస్తే మాత్రం షాక్ తినాల్సిందే. ప్రపంచ వినాశనాన్ని చేసే మహత్తర శక్తిని క్షిపణి రూపంలో తయారు చేయాలని తహతహలాడుతున్న వైఖరి బెదురు పుట్టించటం ఖాయం.
సతాన్ 2 పేరిట తయారు చేస్తున్న ఈ అణుక్షిపణి సామర్థ్యం దాదాపు 9600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల్ని సమర్థవంతంగా చేధిస్తుందని చెబుతున్నారు. ఈ అణుక్షిపణి ఎంత భయంకరమైనదంటే.. ఫ్రాన్స్ లాంటి దేశాన్ని క్షణాల్లో భస్మీపటలం చేసేంత శక్తి దీని సొంతమని చెబుతున్నారు. అంతే కాదు.. ఈ క్షిపణితో ఒకేసారి.. 16 ప్రాంతాలపై దాడి చేసే సత్తా ఉందని రష్యానే ప్రకటించింది.
ఒక్క బటన్ నొక్కితే చాలు.. తనకు నిర్ణయించిన లక్ష్యానికి దూసుకెళ్లి సర్వం నాశనం చేసేస్తుందని చెబుతూ.. ఆ అణుక్షిపణికి సంబంధించిన ప్రణాళికను.. చిత్రాల్ని రష్యా విడుదల చేసింది. ఈ మధ్య కాలంలో అణు యుద్ధానికి ఉవ్విళ్లూరుతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్న వేళ.. సైతాన్ లాంటి సతాన్ క్షిపణి సమాచారం వణికిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద అమెరికా ప్రయోగించిన అణుబాంబు కంటే వెయ్యిరెట్లు ఎక్కువ సామర్థ్యం దీని సొంతమని.. రెండేళ్లలో దీన్ని తయారు చేయటానికి రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఒకపక్క ప్రపంచం పాలిట ప్రమాదకరంగా మారిన అణుక్షిపణుల్ని నిర్మూలించాలన్న వాదన వినిపిస్తున్న వేళ.. ఇప్పుడు అందుబాటులో ఉన్న వాటి కంటే భయంకరమైన క్షిపణుల్ని తయారు చేయాలన్న రష్యా ఆలోచనకు మిగిలిన దేశాలు ఎలా స్పందిస్తాయన్నది పెద్ద ప్రశ్నగా మారనుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/