Begin typing your search above and press return to search.
ఇది చదివి మానవత్వం చచ్చిందనుకోవాలా?
By: Tupaki Desk | 4 March 2016 10:45 AM GMTబాలికపై కన్నతండ్రి అత్యాచారం. ఇలాంటి సంఘటనలు అస్సలు జరుగుతాయా అనే పరిస్థితి నుంచి... మంచితనం, మానవత్వం చంపుకున్న దుర్మార్గుల వల్ల అవును జరుగుతున్నాయనే కాలానికి మనం చేరిపోయాం. దురదృష్టకరమే అయినప్పటికీ ఇలాంటి ఘటనలు లోకానికి తెలిసినపుడు కచ్చితంగా సదరు తండ్రిని చీత్కరిస్తారు. కానీ ఈ సంఘటనలో అలా జరగలేదు. బాలికను తప్పుపట్టారు. అంతేకాకుండా ఆమెకే శిక్షవేశారు.సభ్యసమాజం సిగ్గుపడేలా జరిగిన ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది.
కన్నతండ్రే ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక సారి కాదు, ఒక రోజు కాదు ఏకంగా నాలుగు నెలల పాటు ఆమెపై అత్యాచారం చేశాడు. అంతటితో ఆ బాలిక కష్టాలు తీరలేదు. గర్భవతి మారింది. ఈ విషయం బయటపడి నలుగురి నోళ్ల ద్వారా రచ్చరచ్చగా మారి పంచాయతీ వరకూ వెళ్లింది. అయితే ఆ బాలికకు న్యాయం చేయాల్సిన పంచాయతీ పెద్దలు తండ్రి కంటే రాక్షసంగా ప్రవర్తించారు. తండ్రి అత్యాచారం చేస్తుంటే ప్రతిఘటించలేదని ఆమెకు పది కొరడా దెబ్బలు శిక్ష విధించిన ఆ పంచాయతీ నిర్వాహకులు ఆ శిక్షను అమలు చేశారు. ఈ దారుణాతి దారుణమైన సంఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జరిగింది. ఆర్టీఐ ఉద్యమకారుడు ఒకరు ఇందుకు సంబంధించిన ఫొటోలు - ఇతర ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.