Begin typing your search above and press return to search.
సదాశివయ్యను సీఎం దగ్గరకు తీసుకొచ్చేస్తున్నారట!
By: Tupaki Desk | 17 July 2020 9:10 AM GMTప్రతిపక్ష నేతలకు టైమిచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్.. అందుకు భిన్నంగా అత్యంత సామాన్యుల్ని కలిసేందుకు ఆయన మక్కువ చూపుతుంటారు. ఆ మధ్యన ఫాంహౌస్ కు అల్లం పండించే రైతులతో పాటు.. భిన్నరీతిలో వ్యవసాయం చేసే వారిని కలిసి.. వారితో వ్యవసాయం కష్టనష్టాలపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.
కీలక స్థానాల్లో ఉన్న అధికారులతో భేటీ విషయంలోనూ కేసీఆర్ ఆచితూచి అన్నట్లుగా నిర్ణయం తీసుకుంటారు. నెలల తరబడి సీఎం సమయం కోసం ఎదురుచూసే విభాగాధిపతులు ఎందరో. అందుకు భిన్నంగా ఊహించని రీతిలో నిర్ణయాలు తీసుకొని వారితో భేటీ అయ్యేందుకు ఆసక్తి ప్రదర్శించటం కేసీఆర్ కు అలవాటే. నిన్నటికి నిన్న విద్యాశాఖకు సంబంధించిన అంశాల మీద జరిపిన సమీక్ష సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో వృక్షశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సదాశివయ్య గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెప్పారు. ఆయనతో పాటు పెద్దపల్లి జిల్లా పత్తిపాక హైస్కూల్ హెడ్ మాస్టర్ గా పని చేస్తున్న డాక్టర్ పీర్ మహ్మద్ షేక్ గురించి చెప్పారు.
తాము పని చేస్తున్న చోట పెద్ద ఎత్తున మొక్కలు పెంచుతున్న వారి తీరును అభినందించిన కేసీఆర్.. వారితో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా వారికి కంగ్రాట్స్ చెప్పి.. మరింతగా పని చేయాలన్న ప్రోత్సాహపు మాటల్ని చెప్పారు. అక్కడికే ఆగితే ఆయన కేసీఆర్ ఎందుకు అవుతారు? ఈ రోజు సదాశివయ్యను కలుసుకునేందుకు కబురు పెట్టినట్లుగా తెలిసిందే. ఓవైపు కరోనాతో కిందామీదా పడిపోతున్న వేళ.. ఇలా ఒక సామాన్య ఉపాధ్యాయుడ్ని కలవటానికి ముఖ్యమంత్రి చూపిస్తున్న ఆసక్తి అందరిని ఆకర్షిస్తోంది.
ఇదే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కావాల్సింది. తాను నాటకీయంగా కలిసే వ్యక్తులు సామాన్యులుగా ఉండటం.. వారిని కలిసిన తీరుపై మీడియాలో వచ్చే పాజిటివ్ వార్తలు.. ఉస్మానియా ఆసుపత్రిలో వర్షపు నీళ్లు నిలవటం.. కరోనా కేసులు పెరగటం లాంటి సమస్యల్ని మర్చిపోయేలా చేస్తుందని చెప్పాలి. ఈ కారణంతోనే.. అనూహ్య భేటీలతో అందరి చూపు తన మీద పడటమే కాదు.. మా సీఎం సారుది ఎంత పెద్ద మనసు అనేలా చేయటంలో కేసీఆర్ ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతున్నారనే చెప్పాలి.