Begin typing your search above and press return to search.

అమెరికా దళాల పరువుతీసేలా తాలిబన్ల ఫొటో

By:  Tupaki Desk   |   23 Aug 2021 6:59 AM GMT
అమెరికా దళాల పరువుతీసేలా తాలిబన్ల ఫొటో
X
1945లో జరిగిన రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా దళాలు తమ జెండా పాతిన ఫొటోను తీసుకొని తాలిబన్లు మార్ఫింగ్ చేసి అప్ఘనిస్తాన్ లో తాలిబన్ల జెండాను పాతేశారని విడుదల చేసిన ఫొటో వైరల్ గా మారింది. అమెరికా పరువు తీసేలా ఈ ఫొటో ఉంది. అదిప్పుడు అమెరికాను అపహాస్యం చేసేలా ఉంది.

తాలిబాన్ పోరాట యోధుల ఎలైట్ యూనిట్ తాజాగా అమెరికా దళాలు గతంలో సాధించిన విజయం గుర్తు ఫొటోను తీసుకొని దానికి తాలిబన్ జెండాను అమర్చి ప్రచార ఫొటోను విడుదల చేశారు. ఇది అమెరికన్ సేనలకు అవమానంగా ఉందని రష్యా టుడే పత్రిక సంచలన పోస్ట్ చేసింది. 1945 లో ఇవో జిమా యుద్ధ సమయంలో అమెరికా సేనలు తీసిన ఫొటో అదీ.

అమెరికా సేనలు అప్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకోవడంతో తాలిబన్లు నెలరోజు్లోనే ఆక్రమించారు. దీంతో 20 సంవత్సరాల కిందటి వారి పాలనను అనుభవించిన వారు ఆ దేశం నుంచి అంతకుముందే కొందరు ఇతర దేశాలకు వెళ్లారు. కొందరు అవకాశం దక్కని వారు విమానం రెక్కలను పట్టుకొని వేలాడిన వీడియో ఇటీవల బయటకొచ్చిన విషయం తెలిసిందే. తాలిబన్ల పాలనలో తాముండలేమని అప్ఘాన్ ప్రజలు పారిపోవడాన్ని చూసి తాలిబన్ల ముఖ్య నాయకులు ప్రజలు దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని, తాము ప్రజాస్వామ్యాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. అయితే వాస్తవం అక్కడ వేరేగా ఉంది.

అమెరికా, దాన్ని మిత్ర దేశాల భవిష్యత్తును అంధకారంలో పడేసేంది. అస్తవ్యస్థమైన విధానాలతో అప్ఘనిస్తాన్ నుంచి ఉన్న ఫళంగా అమెరికా వైదొలగడం విమర్శల పాలు చేసింది. గత వారం రోజులుగా అమెరికా తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, యూఎస్ కమాండ్ ఇన్ చీఫ్ లపై తీవ్ర ఆగ్రహావేశాలను ప్రపంచవ్యాప్తంగా వ్యక్తం చేశారు.

ఇటీవల న్యూస్ మాక్స్ టీవీలో హోస్ట్ గా ఉన్న టీవీ వ్యాఖ్యత జాన్ కార్డిల్లో అయితే ఏకంగా ‘జోబైడెన్ రాజీనామా చేయాలి. లేదా అభిశంసన ద్వారా తొలగించబడాలి’ అని సంచలన పిలుపునిచ్చాడు. అప్ఘన్ దుస్థితికి అమెరికానే కారణం అని అక్కడి మీడియా హోస్ట్ లు దుమ్మెత్తి పోస్తున్నారు. ‘ఇదీ జోబైడెన్ పాలన అని అమెరికన్ కాంగ్రెస్ మహిళ ఎలిసి్ స్టెఫానిక్ విమర్శలు చేశారు. ప్రపంచం మమ్మల్ని చూసి నవ్వుతోందని రిపబ్లికన్ సెనెటర్లు వాపోతున్నారు.

అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ఉపసంహరించుకున్న తర్వాత అప్ఘనిస్తాన్ జాతీయ ఆర్మీ పూర్తిగా చేతులెత్తేసింది. చాలా మంది తాలిబన్లతో పోరాటం చేయకుండానే లొంగిపోయారు. వారి ఆయుధాలు, యుద్ధ సామాగ్రి, వాహనాలు అప్పగించి తాలిబన్లతో చేరిపోయారు.

కొన్ని అంచనాల ప్రకారం.. తాలిబన్లు ఇప్పుడు 2000 అమెరికా హవ్ వీస్, ఇతర సాయుధ వాహనాలను కలిగి ఉన్నారు. బ్లాక్ హాక్స్, స్కౌట్ అటాక్ హెలిక్యాప్టర్లు , మిలిటరీ డ్రోన్లతో సహా 40 విమానాలను కలిగి ఉన్నారు. 2003 నుండి పెంటగాన్ ఆఫ్ఘన్ దళాలకు బహుమతిగా ఇచ్చిన 600,000 M16 అస్సాల్ట్ రైఫిల్స్ మరియు ఇతర పదాతిదళ ఆయుధాలు, దాదాపు 162,000 కమ్యూనికేషన్ పరికరాలు మరియు 16,000 నైట్-విజన్ గాగుల్స్ విస్తారమైన ఆయుధాలను కూడా తాలిబన్ల వశమయ్యాయి.

అదే సమయంలో అప్ఘన్ లో వైదొలగడంపై అధ్యక్షుడు జో బిడెన్ నిర్ణయం సరైందేనని విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ నాయకులు మరియు మిలిటరీ తాలిబాన్లను ఎదుర్కోవడంలో విఫలమయ్యారని నిందించారు. యుఎస్ మిలట్రీ ఆఫ్ఘనిస్తాన్ కోసం దాదాపు 20 సంవత్సరాలు పోరాడింది. తాలిబన్లపై అమెరికా సైన్యం చేయగలిగినదంతా చేసింది అని సమర్తించుకున్నారు.