Begin typing your search above and press return to search.
ములాయం నోరెత్తితే బాబు సైకిలు పంక్చరే!
By: Tupaki Desk | 3 April 2018 6:28 AM GMTఆయన కూడా సైకిలే.. ఈయన కూడా సైకిలే! ఆ ఇద్దరూ ములాయం సింగ్- చంద్రబాబునాయుడు. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న ఓ గుట్టు- ములాయం చేతిలో ఉంది. అదే తమాషా! ములాయం సింగ్.. ఎటూ బాబు తో తనకు అవసరమేమీ లేదు గనుక.. నోరు తెరచి.. తనకు తెలిసిన వాస్తవాలను వెల్లడించినా.. లేదా, అప్పటి పరిణామాలు బాబు చెప్పినట్లుగా కాకుండా మరో రకంగా జరిగాయని చెప్పినా... చంద్రబాబు పరువు పోతుంది.
ఇంతకూ విషయం ఏంటంటే.. తనను తాను మహానుభావుడిగా, రాష్ట్రం కోసం కుటుంబాన్ని - వ్యాపారాల్ని ఎన్నింటినో త్యాగం చేసిన మహనీయుడిగా అభివర్ణించుకోవడం చంద్రబాబుకు కొత్త కాదు. ఆ క్రమంలోనే ఆయన తాను గతంలో ప్రధాని పదవిని కూడా వదిలిపెట్టినట్టు పలుమార్లు చెప్పుకున్నారు. ఈ విషయం గతంలో కూడా పలుమార్లు చంద్రబాబు చెప్పారు గానీ.. ఈసారి పార్టీ ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లేముందు నిర్వహించిన సమావేశంలో మరో సారి తన ఢిల్లీ సింహాసనాభిలాషను – ఆ త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. తన మాటల్ని సొంత ఎమ్మెల్యేలే నమ్మడం లేదని ఆయనకు అనుమానం వచ్చిందో ఏమో తెలియదు గానీ... తనకు అప్పట్లో ఏయే నాయకులు కలసి ప్రధాని పగ్గాలు చేపట్టే ఆఫర్ ఇచ్చారో కూడా చంద్రబాబు వెల్లడించారు.
వారిలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ - మూపనార్ - బిజూ పట్నాయక్ ఎప్పుడో చనిపోయిన నాయకులు కాగా, లాలూ ప్రసాద్ జైల్లో ఉన్నారు. బాబు మాటలు నిజమో కాదో ఆయన చెప్పలేరు. ఇక పోతే ... ములాయం సింగ్ మిగిలారు. అప్పట్లో ములాయం కూడా తనను ప్రధాని పదవి తీసుకోవాల్సిందిగా కోరినట్లు బాబు చెబుతున్నారు.
ఈ మాట దగ్గరే ప్రజలకు డౌటు కొడుతోంది. ములాయం కు తాను ఏదో ఒక నాటికి ఈ దేశానికి ప్రధాని కావాలనే కోరిక చాలాకాలంగా చాలా బలంగా ఉంది. అలాంటిది.. కూటమికి నేతృత్వం వహించే ఖాళీ ఉన్నప్పుడు దానికి తను ప్రయత్నించుకోకుండా.. బాబుకు ఎందుకు ఆఫర్ పెట్టాడనేది జనం సందేహం.
అందుకే చంద్రబాబు చెప్పిన పేర్లలో ప్రస్తుతం అవైలబుల్ గా ఉన్న ములాయం సింగ్.. నోరు తెరచి అప్పటి వాస్తవాలు బయటపెట్టారంటే.. బాబు సైకిలు పంక్చర్ అవుతుందని పలువురు జోకులు వేసుకుంటున్నారు. పైగా ములాయం ఇప్పుడు కాంగ్రెస్ తో జట్టుకట్టి ఉన్నారు. అప్పట్లో కాంగ్రెస్ వ్యతిరేకంగా ఏర్పడిన కూటమి గురించి బాబు చెప్పిన కబుర్లను ఖండించినా ఆశ్చర్యం లేదు. ఏదో తనకు ప్రధాని చాన్సొచ్చిందని.. జనాంతికంగా చెప్పి వదిలేయకుండా.. ఇలా ఎవరు కోరారనే కబుర్లు కూడా చెప్పి ఇరుక్కోవడం ఎందుకని.. పార్టీ నేతలు కూడా అనుకుంటున్నారు.