Begin typing your search above and press return to search.
రజనీ సినిమా..అమరావతి నిర్మాణం ఒకటే
By: Tupaki Desk | 24 Sep 2017 6:09 PM GMTఇప్పుడిప్పుడే...ఇంకా డిజైన్ల దశలోనే ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని...అప్పుడెప్పుడో...దాదాపుగా....ఇరవై ఏళ్ల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన అరుణాచలం సినిమాతో పోల్చడం ఎంతవరకు సబబు? అందులోనూ రజనీ సినిమాతో రాష్ట్ర ప్రజల రాజధాని ప్రస్తవవకు పోలిక ఏంటి? అని కస్సుబుస్సులాడకండి. అరుణాచలం సినిమాకు అమరావతి నిర్మాణానికి నిజంగానే లింకు ఉందని అంటున్నారు.
ముందుగా అరుణాచలం సినిమా విషయానికి వస్తే....అందులో హీరోగా నటించిన సూపర్ స్టార్ రజనీకాంత్ 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టి 3000 కోట్ల సంపదకు వారసుడు కావడం కీలక అంశం..నెలరోజుల వ్యవధిలోనే దానిని ఖర్చు చేయాల్సిన డెడ్‌లైన్ కోసం హీరో పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావుఇప్పుడు సరిగ్గా ఏపీ రాజధాని అమరావతి విషయంలో అదే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. రాజధాని అమరావతిని పూర్తి చేసేందుకు రూ.58 వేల కోట్లు అవసరమని సీఆర్‌డీఏ అధికారులు అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఈ మొత్తంలో తొలి మూడేళ్లలోనే రూ.30 వేల కోట్లు ఖర్చవుతుందని చెబుతున్నారు. అయితే ఇప్పటికీ ఒక్క పనీ ప్రారంభించని నేపథ్యంలో ఏడాదికి రూ.పది వేల కోట్లు ఎలా ఖర్చు చేస్తారనేది ప్రశ్నార్థకమవుతోంది. హడావుడిగా ఖర్చు చేయాలని ప్రయత్నిస్తే ఆర్థికంగా అక్రమాలు జరిగే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులే కాదు ప్రభుత్వ అధికారులు సైతం అనుమానిస్తున్నారు.
ఈ దసరాకు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే డిజైన్ల విషయంలో రోజుకో ఆలోచన చేస్తుండడం కూడా రాజధాని నిర్మాణ జాప్యానికి ఒక కారణమవుతోంది. డిజైన్లు ఖరారు చేసి, దసరా రోజుల్లో శంకుస్థాపన చేయాలని అనుకున్నప్పటికీ, సినీ దర్శకులు రాజమౌళిని సీఎం చంద్రబాబు రంగ ప్రవేశం చేయించడంతో మరికొంత జాప్యం తప్పనిసరి అంటున్నారు. కేవలం సినిమా సెట్టింగులను కంప్యూటర్లలో తయారు చేయించుకునే ఆయనకు సలహాల బాధ్యత అప్పగించడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని విపక్షాలు, కొంతమంది అధికారులు కూడా వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ వాటన్నింటినీ పక్కనపెట్టి ఇదే విధానాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి భావించడం వల్ల దసరాకు శంకుస్థాపన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండేళ్ల కాలయాపన తరువాత కేవలం మూడేళ్లలో రూ.30 వేల కోట్లు ఖర్చు చేయనున్నారన్నమాట.
కొసమెరుపుః రాష్ట్రప్రభుత్వం అత్యంత కీలకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టులో కూడా ఏటా రూ.500 వెయ్యి కోట్లు మాత్రమే ఖర్చు చేయగలుగుతున్నారు. ఇక రాజధాని విషయంలో ఏటా రూ.10వేల కోట్ల ఖర్చు ఎలా అనేది వేచిచూడాల్సిందే. ఈ ఖర్చుల లెక్కలు, నిర్మాణం గురించిన ప్రకటనలు చూస్తుంటే అరుణాచలం సినిమా గుర్తుకువస్తోందని విమర్శకులు అంటున్నారు.