Begin typing your search above and press return to search.

'ఇది త‌ప్ప అన్ని ఇచ్చామ‌'న్న పోస్టు!

By:  Tupaki Desk   |   3 Aug 2018 5:32 AM GMT
ఇది త‌ప్ప అన్ని ఇచ్చామ‌న్న పోస్టు!
X
సోష‌ల్ మీడియా ఎంట్రీ పుణ్య‌మా అని.. సామాన్యుడు చెల‌రేగిపోతున్నారు. త‌న క‌డుపు మంట‌ను చిన్న పోస్టుతో చెప్పేస్తున్నాడు. అత‌గాడి మాట‌లు చాలా సంద‌ర్భాల్లో వైర‌ల్ గా మారుతున్నాయి. విభ‌జ‌న నేప‌థ్యంలో మోడీ అండ్ కో ఇచ్చిన హామీలు.. నాడు మోడీకి వంత పాడిన చంద్ర‌బాబు నాయుడు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ లు తార్వాతి కాలంలో చేతులు ఎత్తేయ‌టం.. మోడీని ప్ర‌భావితం చేయ‌క‌పోవ‌టంతో మొత్తంగా ఏపీ ప్ర‌జ‌లు న‌ట్టేట మునిగిపోయారు.

నాలుగేళ్లు మోడీతో సంసారం చేసిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఈ రోజున మోడీని తిట్టేస్తూ.. త‌న త‌ప్పుల్ని క‌ప్పి పుచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. విభ‌జ‌న హామీల్ని నెర‌వేర్చుక‌పోవ‌టం మోడీ త‌ప్పులుగా చిత్రీక‌రిస్తున్న తెలుగు త‌మ్ముళ్లు.. నాలుగేళ్లు ఏం చేశార‌న్న ప్ర‌శ్న‌కు మాత్రం స‌మాధానం చెప్ప‌టం లేదు.

చంద్ర‌బాబు ఒక్క‌రే కాదు.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం త‌ప్పులు చేశార‌ని చెప్పాలి. మోడీ హ్యాండ్ ఇచ్చిన వైనంపై ఒక‌సారి ఘాటుగా.. మ‌రోసారి ఆయ‌న‌కు ద‌న్ను అన్న‌ట్లుగా మాట్లాడే ప‌వ‌న్ లో స్థిర‌త్వం త‌క్కువ‌. ఇక‌.. బాబుకు ఉన్న అనుభ‌వంతోనే తాను న‌మ్మిన‌ట్లుగా చెప్పే ప‌వ‌న్‌.. త‌న తీరుతో ఏపీకి జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగింది.

ఈ రోజున చంద్ర‌బాబు.. ప‌వ‌న్ లు ఏపీకి ఏదేదో జ‌రిగింద‌ని.. త‌ర‌చూ గ‌ళం విప్పే ఈ ఇద్ద‌రు నేత‌లు.. త‌మ వైఫ‌ల్యాల్ని క‌ప్పిపుచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. బీజేపీ చేసిన న‌మ్మ‌క‌ద్రోహాన్ని ఎంత త‌క్కువ‌గా చెప్పుకుంటే అంత మంచిది. విభ‌జ‌న హామీల్ని అమ‌లు చేస్తామ‌ని న‌మ్మ‌కంగా చెప్పి.. తియ్య‌టి మాట‌ల‌తో మాయ చేసి.. ఈ రోజున ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్న తీరుపై.. ఒక వ్యంగ్య వైర‌ల్ పోస్టు సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నంగా మారింది. ఏపీ ప‌ట్ల బీజేపీ తీరును ఎండ‌గట్టేలా ఉంది. రెండురోజుల నుంచి ఈ పోస్టు వైర‌ల్ గా మారి.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇంత‌కీ.. ఆ పోస్టులో ఏముందో చూస్తే..

రైల్వే జోన్ అడిగితే… అది తప్ప అన్ని ఇచ్చాం….
కడప ఉక్కు ఫ్యాక్టరీ…. అది తప్ప అన్ని ఇచ్చాం…
విశాఖ రైల్వే జోన్… అది తప్ప అన్ని ఇచ్చాం…
దుగ్గిరాజు పట్నం పోర్టు… అది తప్ప అన్ని ఇచ్చాం…
వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజ్… అది తప్ప అన్ని ఇచ్చాం…
లోటు బడ్జెట్… అది తప్ప అన్ని ఇచ్చాం…
పోలవరం నిధులు… అది తప్ప అన్ని ఇచ్చాం…
రాజధాని నిర్మాణం… అది తప్ప అన్ని ఇచ్చాం…
విజయవాడ - విశాఖ మెట్రో…. అది తప్ప అన్ని ఇచ్చాం…
జాతీయ యూనివర్సిటీలకు పూర్తి నిధులు…. అది తప్ప అన్ని ఇచ్చాం…