Begin typing your search above and press return to search.

వైర‌ల్ గా 'ఏం అల్లుడు హ‌రీశ్ గెలుస్తామా పోస్టు'!

By:  Tupaki Desk   |   15 Aug 2018 4:38 AM GMT
వైర‌ల్ గా ఏం అల్లుడు హ‌రీశ్ గెలుస్తామా పోస్టు!
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌ర్కారుపై ప్ర‌శ్నాస్త్రాల్ని సంధించే నాయ‌కుడు ఒక్క‌డు క‌నిపించ‌డు. విప‌క్షం బ‌ల‌హీనంగా ఉంటే అధికార‌ప‌క్షం ఎలా చెల‌రేగిపోతుంద‌న్న దానికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్ని చూస్తే ఇట్టే అర్థం కాక మాన‌దు. ప్ర‌శ్నించాల్సిన పాత్రికేయం.. మ‌న‌కెందుకులే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌టంతో పాటు.. వ్య‌వ‌స్థ‌లన్నీ ఎవ‌రికి వారు త‌మ మానాన తాము ఉండ‌టం కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే.. ప్ర‌శ్నించే సాహ‌సం ఇప్పుడు తెలంగాణ‌లో ఎవ‌రూ చేయ‌లేని ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. ఢిల్లీ నుంచి వ‌చ్చిన కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ పుణ్య‌మా అని కొత్త ఉత్సాహం కాంగ్రెస్ లో తొణికిస‌లాడుతోంది. అటు మోడీపైనా.. ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పైనా తీవ్ర‌స్థాయిలో విరుచుకుపడ్డారు రాహుల్‌.

ఇప్ప‌టివ‌ర‌కూ తెలంగాణ ప్ర‌భుత్వంలో జ‌రిగిన త‌ప్పుల్ని తీవ్ర‌స్థాయిలో వేలెత్తి చూపించినోళ్లు లేరు. ఎన్నిక‌లు ముంగిట్లోకి తెచ్చేసిన కేసీఆర్ కు.. రాహుల్ రూపంలో ప్ర‌శ్న‌ల వ‌ర్షం కుర‌వ‌టంపై గరంగ‌రంగా ఉన్నారు. ఇలాంటి వేళ‌లోనే.. కేసీఆర్ స‌ర్కారుపై ప్ర‌శ్నాస్త్రాల్ని సంధిస్తూ.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న పోస్టు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ఏం అల్లుడు హరీశ్ 2019 (ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో 2018అని చెప్పుకోవాలేమో) లో గెలుస్తాం అంటావా ? అన్న‌శీర్షిక‌తో వైర‌ల్ అవుతున్న ఈ పోస్టులో.. నాలుగున్న‌రేళ్ల కాలంలో ప్ర‌జ‌ల‌కు తామిచ్చిన హామీల్ని నెర‌వేర్చ‌లేద‌ని.. జ‌నాలు మ‌స్తు గ‌రం గ‌రం ఉన్నారంటూ.. కొన్ని అంశాల్ని ఉద‌హ‌రించిన తీరు ఇప్పుడు ఆంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ఇంత‌కీ.. ఆ అంశాలు ఏమంటారా? లిస్టు అయితే.. పెద్ద‌దిగానే ఉంది. అందులో కొన్ని త‌ప్పులు ఉన్నా.. మొత్తంగా చూస్తే మాత్రం కేసీఆర్ స‌ర్కారు వైఫ‌ల్యాలపై భారీ చిట్టాగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇంత‌కీ ఆ విమ‌ర్శ‌ల చిట్టాను య‌థాత‌ధంగా విప్పితే...

1.కేజీ నుంచి పీజీ ఉచిత విద్య అమలు కాలే....

2.దళితుడిని సీఎం చేస్తాం అన్నాం చేయలేదు...

3.అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తాము అన్నాం...

4.అమరవీరుల కుటుంబాలకు ఇంటింటికీ ఒక ఉద్యోగం కల్పిస్తాం అన్నాం.

5. ఇంటింటికీ సర్వే నిర్వహించము కానీ ఏమీ చెయ్యలేదు...

6. తెలంగాణ విద్యార్థులకు ఇంటికొక ఉద్యోగం ఇస్తాం అనీ చెప్పినం...

7. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చి దిద్దుతం అన్నాం.

8. టాంక్ బండ్ ను మంచి నీటి సరస్సుగా మారుస్తాం అన్నాం.

9. హైదరాబాద్ లో ట్రాఫిక్ లేకుండా చేస్తాం అన్నాం.

10. 2019 కన్న ముందే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు,, సాగు,, నీరు ఇస్తాం అన్నాం.

11. హైదరాబాద్ లో రోడ్డు లా పరిస్థితిని చక్క దిద్దుతం అన్నాం.

12. హైదరాబాద్ లో వైట్ ట్యాపింగ్ రోడ్లు వేస్తాం అని చెప్పాం.

13. హైదరాబాద్ లో పరిశ్రమలు స్థాపన చేసి వేల మంది నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తాం అన్నాం.

14. హైదరాబాద్ లో ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తాం అనీ చెప్పినం.

15. మూసి సుందరీకరణ పనులకు 3,000 కోట్లు కేటాయిస్తం అన్నాం...

16. ఒంటరి మహిళలకు పింఛను ఇస్తాం అనీ చెప్పాం..

17. హైదరాబాద్ ను స్మార్ట్ సిటీ హబ్ గా మారుస్తాం అన్నాం.

18. అక్రమ సరఫరా చేస్తున్న వారిని శిక్షిస్తం అన్నాం.

19. నకిలీ తయారిల పైన ఉక్కుపాదం మోపుతం అన్నాం.

20. నయిం, కేసు ను పూర్తిగా పక్కదారి పట్టించం.

21. మియాపూర్ భు కుంభకోణం లో అసలు నిందితుల్ని శిక్షిస్తామని చెప్పాం..

22. టాలీవుడ్ డ్రగ్స్ కేసు కూడా ముయించం.

23. ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటే కటినంగా శిక్షిస్తాo అన్నాం.

24.ఇసుక మాఫియా కు అడ్డుకట్ట వేస్తాం అన్నాం.

25. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేదు..

26. హైదరాబాద్ లో ఉచిత వైఫై కల్పిస్తాం అన్నాం.

27. ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చాం..

28. ఉద్యమ కారులకు మొండి చెయ్యి చూపించాం..

29. హైదరాబాద్ లో నకిలీ తయారిలా పైన ఇంతవరకు చర్యలు తీసుకోలేదు.

30. తెలంగాణ లో ఆస్పత్రి లా గతిని మార్చలేదు....

31. రెవెన్యూ శాఖ లో భారీగా అక్రమలు చోటు చేసుకున్నాయి...

32. జిహెచ్ఎంసి లో అక్రమాలు చాలా వున్నాయి..

33. చదువుకున్న యువతకు గొర్రెలు బర్రెలు మేకలు చేపలు ఇచ్చి వారి భవిష్యత్ నాశనం చేశాం...

34. అక్రమ వలసదారుల పైన చర్యలు తీసుకోలేదు..

35. బంగారు తెలంగాణ అనీ చెప్పి అప్పుల తెలంగాణను చేశాం..

36. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు చేయలేదు...

37.ఒక్క నీటి ప్రాజెక్ట్ ఒక్క‌టి పూర్తి చేయ‌లేదు

38. నిజాం షుగర్స్ మరియు సిర్పూర్ కగజ్ నగర్ పేపర్ మిల్లు పరిశ్రమలు తెప్పించలేదు....

39. తెలంగాణ లో ఎక్కడ చూసిన అవినీతి.

40. ఉత్తమ మద్యం పాలసీ ద్వారా పేద కుటుంబ జీవనం ప్రశ్నార్థకం.

41. హైదరాబాద్ ను డల్లాస్ సిటీ కి ధీటుగా మారుస్తాం అన్నాం.

42. కరీంనగర్ ను లండన్ గా మారుస్తాం అన్నాం.

43. వరంగల్ ను రెండో స్మార్ట్ సిటీ గా మారుస్తాం అన్నాం....

ఇక్కడికే పీకల్లోతు అప్పుల ఊబిలో ఉన్నాము .... ఈ సారి ప్రజా తీర్పు ఎలా వుంటుందో తెలియదంటూ ముక్తాయింపుతో సాగిన ఈ పోస్టు ఇప్పుడు ప‌లు వాట్సాప్ గ్రూపుల్లో వైర‌ల్ గా మారింది.