Begin typing your search above and press return to search.
వైరల్ గా మారిన థ్యాంక్స్ అండి కేసీఆర్ గారూ!
By: Tupaki Desk | 1 Sep 2018 5:49 AM GMTమాట ఏదైనా ముఖం మీద చెబితే ఫీలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే మాటను.. టన్నుల టన్నుల గౌరవంతో చెబితే అదిరే ఎటకారంగా మారుతుంది. విమర్శించే వారిని.. వేలెత్తి చూపించే వారికి ఎదురవుతున్న ఇబ్బందులు నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఒక పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నాలుగున్నరేళ్లలో తమ ప్రభుత్వం ఎంత ప్రగతిని సాధించిందోనన్న విషయాన్ని తెలియజెప్పేలా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వైరల్ గా మారిన ఈ పోస్టులో ప్రభుత్వ వైఫల్యాల్ని వరసపెట్టి చెప్పినా.. వాడిన భాషలోనూ.. భావంలోనూ వేలెత్తి చూపించే అవకాశాన్ని ఇవ్వకపోవటం ఆసక్తికరమని చెప్పాలి. సోషల్ మీడియా విస్తృతమయ్యాక.. విమర్శించే వేళ.. టోన్ ను తీవ్రంగా వినిపించటం.. ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయటం కనిపిస్తుంది.
ఇందుకు భిన్నంగా.. ఎక్కడా బ్యాలెన్స్ మిస్ కాకుండా.. ఒక పద్ధతి ప్రకారం.. గౌరవంగా కేసీఆర్ సర్కారు వైఫల్యాల్ని వరుసపెట్టి చెప్పిన వైనం ఇప్పుడు చర్చగా మారింది. తాము చేశామని చెప్పుకునే గొప్పల కోసం దాదాపు రూ.200 నుంచి రూ.250 కోట్ల వరకూ ఖర్చు అవుతుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తున్న వేళ.. ఇందుకు భిన్నంగా ఒకే ఒక్క పోస్టుతో నాలుగున్నరేళ్ల కాలంలో కేసీఆర్ సర్కారు వైఫల్యాల చిట్టా ఎంత భారీగా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇంతకీ.. ఈ వైరల్ పోస్టులో ఏముంది? అందులో ప్రస్తావించిన అంశాలు ఏమిటన్నది చూస్తే..
* దళితుడిని ముఖ్యమంత్రి చేసినందుకు ధన్యవాదాలు KCR గారికీ.
* వెనుకబడిన జాబితా నుంచి 26 సోదర కులాలను తొలగించినందుకు - మా బలహీన వర్గాలను మరింత బలహీనం చేసినందుకు.. సమస్త బలహీన వర్గాల తరుపున ధన్యవాదాలు KCR గారికి
* అందరికి డబుల్ బెడ్ రూమ్ లు కుర్చీ ఏసుకొని కట్టి ఇచ్చినందుకు ధన్యవాదాలు KCR గారికి.
* దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినందుకు ధన్యవాదాలు KCR గారికి.
* రైతులకు ఓకె సారి లక్ష రూపాయలు రుణమాఫీ చేసినందుకు ధన్యవాదాలు KCR గారికి.
* తెలంగాణ లో ఇంటింటికి కుళాయి నీరు ఇచ్చినందుకు ధన్యవాదాలు KCR గారికి.
* ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు ఇచ్చినందుకు ధన్యవాదాలు KCR గారికి.
* ప్రతి ఇంటికి ఒక్క ఉద్యోగం ఇచ్చినందుకు ధన్యవాదాలు KCR గారికి.
* కేజీ నుండి పీజీ వరకు నిర్బంధ విద్య ఇచ్చినందుకు ధన్యవాదాలు KCR గారికి.
* ప్రతి నియోజకవర్గంకి ఒక 100 పడకల హాస్పిటల్ కట్టినందుకు ధన్యవాదాలు KCR గారికి.
* ప్రతి జిల్లాకి ఒక సూపర్ స్పెషాయాల్టీ హాస్పిటల్ కట్టినందుకు ధన్యవాదాలు KCR గారికి.
* ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ ,జూనియర్ కాలేజీ కట్టి నందుకు ధన్యవాదాలు KCR గారికి,
* హైదరాబాద్ లో వంద అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మించినందుకు ధన్యవాదాలు KCR గారికి,
* హుస్సేన్ సాగర్ శుద్ధి చేసినందుకు.. దాని చుట్టూ వందల అంతస్తుల ఆకాశహర్మ్యాలు నిర్మించి పేదలకు పంచినందుకు ధన్యవాదాలు KCR గారికి.
* భద్రాచలం రాములవారి గుడిని 100 కోట్లతో బాగుచేసినందుకు ధన్యవాదాలు KCR గారికి,
* కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేసినందుకు ధన్యవాదాలు KCR గారికి,
* ఇందిరా పార్కు ధర్నా చౌక్ తీసివేసినందుకు ధన్యవాదాలు KCR గారికి,
* ఉస్మానియా యూనివర్సిటీని అబివృద్ధి చేసినందుకు ధన్యవాదాలు KCR గారికి,
* ఉద్యమకారులను గుర్తించి వారి కుటుంబాలకు న్యాయం చేసినందుకు ధన్యవాదాలు KCR గారికి,
* మంత్రి వర్గంలో పూర్తిగా మహిళలకు చోటు ఇచ్చి న్యాయం చేసినందుకు ధన్యవాదాలు KCR గారికి,
* చేనేత కార్మికుల బ్రతకులు బాగుపరచి నందుకు ధన్యవాదాలు KCR గారికి,
* నిజాం సుగర్స్ ఫ్యాక్టరీ తెరిచినందుకు ధన్యవాదాలు KCR గారికి,
* కొత్తగూడెంలో వ్యవసాయ యూనివర్సిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు KCR గారికి,
* డ్రగ్స్ కేసు తెరిచి వాళ్ళను ఏమి చేయనందు ధన్యవాదాలు KCR గారికి,
* నాచారం భూములను కె కె అనుచరులకు కట్టబెట్టినందుకు ధన్యవాదాలు KCR గారికి,
* గుంతలు లేకుండా హైదరాబాద్ రోడ్డులు వేసినందుకు ధన్యవాదాలు KCR గారికి,
* పక్క పార్టీల వారిని పార్టీలో కలుపుకొని.. ఉద్యమాలు చేయని వారికి మంత్రి పదవులు ఇచ్చి, ఉద్యమాలు చేసినవారిని మరచినందుకు ధన్యవాదాలు KCR గారికి,
* ముఖ్యమంత్రి సచివాలయానికే రాకుండా ఎలా పాలించాలో నేర్పినందుకు ధన్యవాదాలు KCR గారికి,
* స భాష అని బూతులు మాట్లాడి తెలంగాణ భాష పరువు తీసినందుకు ధన్యవాదాలు KCR గారికి,
* కులానికి ఒక భవనం కడతా అని నమ్మించినందుకు ధన్యవాదాలు KCR గారికి,
* ఐదేండ్ల పాలనలో ఉద్యోగులకు సంబందించి ఒక్క సమస్య కూడా పరిష్కరించనందుకు ధన్యవాదాలు KCR గారికి,
* "నలుగురిని కూసోబెట్టి ఒక తెల్లకాగితం మీద నాలుగు ముచ్చట్లు రాయించి" ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించినందుకు ధన్యవాదాలు KCR గారికి,
* కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మీరు ఏ పెన్షన్ విధానంలొ కొనసాగుతారు CPS లేకా పాత పెన్షన్ నా అని కేంద్ర ప్రభుత్వం option ఆడిగితే ఎవరిని సంప్రదించకుండ ఉద్యోగుల రెక్కల కష్టం దోచుకునే cps విధానంనే ఎంచుకున్నందుకు, ఉద్యోగులకు అదే మంచి విధానం అని అసెంబ్లీ సాక్షిగా అబద్దపు లెక్కలు చెప్పినందుకు, cps బాధిత ఉద్యోగుల కుటుంబాలు రోడ్లపై రోదిస్తున్నందుకూ..
ధన్యవాదాలు KCR గారికి,
* ప్రగతి మీ వర్గానికి - మీ కుటుంబానికి - ఆ "ప్రగతి నివేదన" అదోగతి పాలైన మాకు నివేదిస్తున్నదుకు
ధన్యవాదాలు KCR గారికి,
* నాలుగున్నర ఏండ్లు నరకం తలపించేలా, మాటలతోనే పూటలు గడిపి, అణిచివేతలో ప్రపంచంలోనే అద్బుతమైన పాలన అందించినందుకు ధన్యవాదాలు KCR గారికి,