Begin typing your search above and press return to search.

వ‌య‌సు చిన్న‌దైన జ‌గ‌న్ ఇంత‌లా దెబ్బేస్తున్నాడే?

By:  Tupaki Desk   |   9 Jun 2019 6:28 AM GMT
వ‌య‌సు చిన్న‌దైన జ‌గ‌న్ ఇంత‌లా దెబ్బేస్తున్నాడే?
X
కాలం క‌లిసి రాన‌ప్పుటు అమ్మ అన్నా..మ‌రోలా వినిపిస్తుంద‌న్న సామెత‌కు త‌గ్గ‌ట్లే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజా మాట ఆయ‌న‌కు పంచ్ గా మారింది. ప్ర‌త్యేక అతిధిగా పిలిచి.. కూర్చోబెట్టిన‌ప్పుడు ఎంత మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అన్న విష‌యాన్ని కేసీఆర్ కు చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కానీ.. అలాంటి ఆయ‌న సైతం పెద్ద‌రికంతో.. జ‌గ‌న్ మీద ఉన్న చ‌నువులో అన్న ఒక్క మాట సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌ట‌మే కాదు.. పంచ్ మీద పంచ్ లు ఇస్తూ పోస్టులు పెడుతున్నారు.

ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి ప్ర‌త్యేక అతిధిగా హాజ‌రైన కేసీఆర్ మాట్లాడుతూ.. వ‌య‌సు చిన్న‌ది.. బాధ్య‌త పెద్ద‌దంటూ త‌న ప్ర‌సంగాన్ని షురూ చేశారు. జ‌గ‌న్ వ‌య‌సు చిన్న‌ద‌న్న మాట‌ను ప్ర‌స్తావిస్తూ.. ఇంత చిన్న వ‌య‌సున్న జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఎడాపెడా నిర్ణ‌యాలు తీసుకుంటూ.. పాల‌న‌లో త‌న‌దైన మార్క్ చూపిస్తుంటే.. ఇంత అనుభ‌వం ఉన్నోడివి.. తెలివైనోడివ‌ని చెబుతారు క‌దా? మ‌రి.. జ‌గ‌న్ మాదిరి వినూత్న నిర్ణ‌యాల్ని ఎందుకు తీసుకోవ‌ట్లేదు సారూ.. అంటూ సోష‌ల్ మీడియాలో చెల‌రేగిపోతున్నారు.

తానేదో పెద్దరికంతో అన్న మాట‌ల్ని ప‌ట్టుకొని ఇంత‌లా పంచ్ లు వేస్తున్న వైనం గులాబీ నేత‌ల‌కు ఒక ప‌ట్టాన జీర్ణం కావ‌ట్లేదు. ముఖ్య‌మంత్రిగా ఐదేళ్ల‌ను పూర్తి చేసుకొని.. ఆరో ఏడులోకి ప‌రుగులు తీస్తున్న కేసీఆర్‌.. ఇప్ప‌టివ‌ర‌కూ సీఎం పేషీకి పెద్ద‌గా వ‌చ్చేది లేదు. ఈ ఐదేళ్ల వ్య‌వ‌ధిలో ఐదుసార్లు సీఎం కార్యాల‌యానికి వ‌చ్చి ఉంటారు. తాను న‌మ్మిన నమ్మ‌కానికి పెద్ద పీట వేస్తూ.. సీఎం అంటే స‌చివాల‌యానికి నిత్యం రావాల్సిందేనా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్పుడు అదే ప్ర‌శ్న‌ను ఆగ్ర‌హంతో సంధిస్తున్నారు తెలంగాణ ప్ర‌జ‌లు.

ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌టానికి ముందు అన్ని శాఖ‌ల్ని రివ్యూ చేసిన జ‌గ‌న్ చేస్తున్న ప‌నిని ప్ర‌స్తావిస్తూ.. ఐదేళ్లుగా సీఎంగా ఉన్నావ్‌.. ఎప్పుడైనా ఈ రీతిలో రివ్యూ చేసినావా? అంటూ క‌డిగేస్తున్నారు. వ‌య‌సు చిన్న‌ద‌ని చెప్పుడు కాదు.. చేస్తున్న పెద్ద ప‌నుల్ని చూసైనా నేర్చుకుంటావా? అంటూ పంచ్ లు మీద పంచ్ లు వేస్తున్న విమ‌ర్శ‌కుల మాట‌లు కేసీఆర్ కు ఇప్పుడు షాకింగ్ మారింద‌ని చెప్పక త‌ప్ప‌దు.