Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ సీట్ల జాప్యం.. సెటైర్లే సెటైర్లు

By:  Tupaki Desk   |   12 Nov 2018 12:51 PM GMT
కాంగ్రెస్ సీట్ల జాప్యం.. సెటైర్లే సెటైర్లు
X
అధికార టీఆర్ ఎస్ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకెళ్తోంది. పార్టీ అభ్యర్థులను అసెంబ్లీ రద్దు చేసిన మరుక్షణమే ప్రకటించేసిన కేసీఆర్ నెలరోజుల కిందటే ప్రచార పర్వాన్ని మొదలెట్టేశారు. నామినేషన్లకు ఒక్క రోజు ముందు బీఫారాలు అందజేసి తుది విడత ప్రచారానికి స్కెచ్ గీశారు. గులాబీ అభ్యర్థులంతా నామినేషన్లు వేస్తుండగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి అభ్యర్థుల ఖరారు మాత్రం ఇప్పటికీ కాకపోవడం ఆ పార్టీ నేతలనే కాదు.. సాధారణ ప్రజానీకానికి కూడా పరీక్షగా మారింది. దీనిపై తీవ్ర అసహనం అంతటా వ్యక్తమవుతోంది.

ఇప్పటికీ ముప్పై నలభై సార్లు భేటీలు జరిగినా మహాకూటమి సీట్ల సర్దుబాటు తేలకపోవడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. టికెట్ల కోసం నేతలు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. దక్కవని తెలిసి గాంధీభవన్ వద్ద కొందరు నేతలు ఆందోళన చేస్తున్నారు. భాగస్వామ్య పార్టీలకు కూడా సీట్ల సంఖ్యపై క్లారిటీ లేదంటే అతిశయోక్తికాదు..

ఇలా కాంగ్రెస్ నాన్చివేతపై నెటిజన్లే కాదు... కూటమిలోని టీజేఎస్ అధినేత కోదండరాం కూడా గుస్సా అవుతున్నాడు. ‘మనపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయయ్యా.. తొందరగా ఆ సీట్ల పంపకం ఏదో తేల్చండి’ అంటూ మీడియా వేదికగా ఘాటుగానే కాంగ్రెస్ ను ఉద్దేశించి విమర్శించారు. ఇప్పటికే దీనిపై పవర్ ఫుల్ పంచులతో నెటిజన్లు ట్రోలింగ్ లు - సెటైర్ వీడియోలు హోరెత్తిస్తున్నారు. మహాకూటమి తీరు చూస్తుంటే ఎన్నికల ఫలితాల తర్వాత సీట్లు ప్రకటిస్తారా.? లేక 2024లోనా అంటూ నెటిజన్లు సెటైర్ వేస్తున్నారు. ఇక కేటీఆర్ అయితే ‘కాంగ్రెస్ సీట్లు పంచేసరికి.. ప్రజలు తమ గెలుపు స్వీట్లు పంచుకుంటారు’ అంటూ పంచ్ డైలాగులు విసురుతున్నారు. ఇలా నెటిజన్లకు ఇప్పుడు కాంగ్రెస్ సీట్ల జాప్యం ఓ ఆయుధంగా మారి సెటైర్లు పేలుతున్నాయి.