Begin typing your search above and press return to search.

తెలంగాణలో టీడీపీకి వచ్చిన రెండు సీట్ల క్రెడిట్ లోకేశ్‌ దే

By:  Tupaki Desk   |   12 Dec 2018 10:48 AM GMT
తెలంగాణలో టీడీపీకి వచ్చిన రెండు సీట్ల క్రెడిట్ లోకేశ్‌ దే
X
తెలంగాణలో టీడీపీ పరిస్థితిపై సోషల్ మీడియాలో తెగ సెటైర్లు పడుతున్నాయి. హైదరాబాద్ నిర్మాణం నుంచి సైబరాబాద్‌కు చంద్రబాబు తగ్గించడం.. బాలకృష్ణ ‘హం బుల్ బుల్’ వంటి హైలైట్లన్నీ తెలంగాణ ఎలక్షన్ మ్యాచ్ తరువాత సోషల్ మీడియా తెగ చూపిస్తోంది. అంతేకాదు... టీడీపీకి వచ్చిన రెండు సీట్లపైనా తెగ ట్రోలింగ్ జరుగుతోంది. ఆ రెండు సీట్లు టీడీపీకి వచ్చాయంటే ఆ క్రెడిట్ లోకేశ్ బాబుకే ఇవ్వాలంటున్నారు. ఆయన కనుక ప్రచారానికి వచ్చుంటే ఆ రెండు సీట్లూ గోవిందా అని... ఆయన రాకుండా పార్టీకి రెండు సీట్లు గెలిపించారని అంటున్నారు.

తెలంగాణలో టీడీపీ ఇంచుమించు దుకాణం మూసుకోవాల్సిన పరిస్థితి. కూటమిలో చేరి కొన్ని సీట్లలో పోటీ చేసిన ఆ పార్టీ మొత్తానికి రెండు సీట్లు గెలుచుకుంది. అయితే.. హాట్ సీటు కూకట్ పల్లిని మాత్రం టీడీపీ గెలవలేకపోయింది. స్వయానా ఎన్టీఆర్ మనవరాలే అక్కడ పోటీ చేసినా ఫలితం లేకపోయింది. ఆమె కోసం చంద్రబాబు, ఆమె బాబాయి బాలకృష్ణ కాలికి బలపం కట్టుకుని మరీ ప్రచారం చేసినా ఆమె మాత్రం గెలవలేకపోయింది.

అయితే... ఖమ్మం జిల్లాలో మాత్రం సత్తుపల్లి - అశ్వారావుపేటల్లో విజయం సాధించి పరువు నిలబెట్టుకుంది. అలా టీడీపీ పరువు నిలబడిందంటే అది చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ఘనతేనంటున్నారు నెటిజన్లు.

నాన్న చంద్రబాబు - మామ బాలయ్యలతో పాటు లోకేశ్ బాబు కూడా ప్రచారం చేసుంటే ఆ రెండు సీట్లూ టీఆర్ ఎస్ ఖాతాలోనే పడేవట. అదృష్టం కొద్దీ లోకేశ్ బాబు తెలంగాణలో ప్రచారం చేయకపోవడంతో రెండుసీట్లు వచ్చాయన్నది నెటిజన్ల తీర్పు. అందుకే వారు జై బాలయ్య... జైజై చినబాబు అంటున్నారు.