Begin typing your search above and press return to search.
మోదీ సర్కారు ఆర్థిక ప్యాకేజీపై సెటైర్లే సెటైర్లు
By: Tupaki Desk | 28 March 2020 1:30 AM GMTకరోనా మహమ్మారి తనదైన శైలిలో విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా దేశాలు తమ దేశ ప్రజలను ఆర్థిక ఇబ్బందుల పాలు చేయకుండా ఉంచేందుకు - దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా ఉండేందుకు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. ఈ విషయంలో కరోనాను బాగానే కట్టడి చేయగలిగిన భారత్ కూడా ప్యాకేజీని ప్రకటించింది. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటిస్తే.. ఈ ప్యాకేజీ భారీ ప్యాకేజీనేని - ఈ ప్యాకేజీ దేశ ప్రజలతో పాటుగా దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి బలం ఇచ్చేదేనంటూ దాదాపుగా అన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రశంసల వర్షం కురిపించారు. ఇది జరిగి ఒక్కరోజు కూడా కాలేదు... అప్పుడే మోదీ సర్కారు ప్యాకేజీపై విపక్షాలు విమర్శలు గుప్పించడం మొదలెట్టేశాయి. విపక్షాలతో పాటుగా ఆర్థిక అంశాలపై పట్టున్న దేశ ప్రజలు కూడా సోషల్ మీడియా వేదికగా మోదీ సర్కారుపై విరుచుకుపడుతున్నారు.
ఇలా మోదీ సర్కారు ఆర్థిక ప్యాకేజీపై తొలుత ప్రశంసలు.. ఆ తర్వాత విమర్శలకు కారణం లేకపోలేదు. భారత్ మాదిరే ఇతర దేశాలు కూడా తమ దేశ ప్రజలకు ఆర్థిక వెతలు తప్పేందుకు, తమ దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించాయి. ఈ ప్యాకేజీలను మోదీ సర్కారు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీతో పరిశీలించడంతోనే విమర్శలు మొదలైపోయాయి. అయినా చూడ్డానికి రూ.1.70 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ భారీగానే కనిపిస్తున్నా... దేశ జనాభాను పరిగణనలోకి తీసుకుంటే ఈ ప్యాకేజీ ఎందుకూ కొరగాకుండా పోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాలు కూడా తమ దేశ జనాభాకు సరిపడ ప్యాకేజీలు ప్రకటిస్తే... జనాభా విషయాన్ని అసలు పట్టించుకోకుండానే మోదీ సర్కారు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిందన్న వాదనలు కూడా ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ఇక ఇతర దేశాలు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలను చూస్తే... అగ్రరాజ్యం అమెరికా 2,200 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. చైనా 586 బిలియన్ డాలర్లు, పాకిస్థాన్ 5.6 బిలియన్ డాలర్లు ప్యాకేజీలను ప్రకటించాయి. డాలర్ల లెక్కన చూస్తే... మోదీ సర్కారు ఆర్థిక ప్యాకేజీ విలువ 22.6 బిలియన్ డాలర్లుగా తేలింది. ఇక్కడిదాకా బాగానే ఉన్నా... పర్ క్యాపిటా ప్రకారం చూస్తే... అమెరికా ప్యాకేజీ 6,660 డాలర్లుగా - చైనా ప్యాకేజీ 450 డాలర్లుగా - పాకిస్థాన్ ప్యాకేజీ 22.4 డాలర్లుగా ఉండగా.. భారత్ విషయానికి వస్తే ఇది కేవలం 17.3 డాలర్లుగానే తేలింది. అంటే... పర్ క్యాపిటా ప్రకారం చూస్తే... మోదీ సర్కారు ప్యాకేజీ పాకిస్థాన్ ప్రకటించిన ప్యాకేజీ కంటే కూడా చాలా తక్కువే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న విపక్షాలు - ఆర్థిక రంగ నిపుణులు.. అసలేమాత్రం చాలని ప్యాకేజీని ప్రకటించి ఏం లాభం? కనీసం పాక్ ప్రకటించిన ప్యాకేజీ కంటే కూడా కాస్తంత ఎక్కువ కూడా లేకపోతే.. అసలు ప్యాకేజీకి అర్థం ఉందా? అంటూ మోదీ సర్కారుపై సెటైర్ల వర్షం కురుస్తోంది.